BRS vs TRS: బీఆర్ఎస్‌ను మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని గులాబీ బాస్‌కు విజ్ఞప్తులు
2022 నవంబర్‌లో అప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు అధినేత కేసిఆర్. పేరు మార్చిన ఆ సమయంలోనే దీనిపై కార్యకర్తల్లో విభిన్న వాదనలు వినిపించాయి. ప్రజల్లో కూడా సెంటిమెంట్‌కు పార్టీ దూరమవుతుందని అభిప్రాయం వ్యక్తం అయిందట.

2022 నవంబర్‌లో అప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు అధినేత కేసిఆర్. పేరు మార్చిన ఆ సమయంలోనే దీనిపై కార్యకర్తల్లో విభిన్న వాదనలు వినిపించాయి. ప్రజల్లో కూడా సెంటిమెంట్‌కు పార్టీ దూరమవుతుందని అభిప్రాయం వ్యక్తం అయింది. అయినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఇలాంటి రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంటే మిగతా రాష్ట్రాల్లో ఎంట్రీ అసాధ్యమని భావించిన అధినేత అందుకు అనుకూలంగా భారత్ పేరును పార్టీకి జోడించారు. 2022 -23 సంవత్సరాల్లో మహారాష్ట్రలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి నాందేడ్, నాగపూర్, సోలాపూర్ ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు కూడా ప్రారంభించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పార్టీకి కేంద్ర కార్యాలయాన్ని నిర్మించారు.
ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైంది భారత రాష్ట్ర సమితి. గత వారం రోజులుగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటమిపై పోస్టుమార్టం చేయడంతో పాటు వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టేలా సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో మెజారిటీ కార్యకర్తలు పార్టీ పేరు మార్చడం ద్వారానే ఇబ్బందులు తలెత్తయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మాజీ మంత్రులు కేటీ రావు, హరీష్ రావుల ముందే కార్యకర్తలతో పాటు స్థానిక నేతలు మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు మారుస్తే సక్సెస్ అవుతామని బహిరంగంగానే చెప్పుకొచ్చారు. పార్టీలో తెలంగాణ పదం తీసివేయడంతో సెంటిమెంట్‌కు దూరమయ్యామని ప్రజలు కూడా అదే భావిస్తున్నారని చాలామంది విశ్లేషించారు.
మొన్నటి ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓటర్లైన ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారని విషయాలన్నీ కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే అదే సమావేశంలో కేటీఆర్ కూడా పార్టీ మార్పు జరిగిపోయింది. ఇకపై దానిపై చర్చ అవసరం లేదంటూ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం పార్టీ మార్పుపై కార్యకర్తలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాటన్నింటినీ అధినేత దృష్టికి తీసుకెళ్తున్నామంటూ ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
