AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: హైదరాబాద్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. బీజేపీ గూటికి ఒకప్పటికి ఎంఐఎం అభ్యర్థి?

జూబ్లిహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్‌కు గాలం వేసింది భారతీయ జనతా పార్టీ. నవీన్‌ను బీజేపీలోకి చేర్చుకునేందకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంతనాలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. సుమారు 40 నిమిషాల పాటు కిషన్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ ఏకాంతంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Telangana Election: హైదరాబాద్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. బీజేపీ గూటికి ఒకప్పటికి ఎంఐఎం అభ్యర్థి?
Naveen Kumar Yadav
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 14, 2023 | 1:27 PM

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారతున్నాయి. హైదారాబాద్‌లో జూబ్లిహిల్స్ సీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అనూహ్య రీతిలో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డిని కాదని భారత మాజీ కెప్టెన్ అజారుద్దిన్ సీటు దక్కించుకున్నారు. అటు బీజేపీ నుంచి లంకెల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థిగా మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌ రంగంలోకి దిగారు. ఈ సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఎంఐఎం నేత నవీన్ యాదవ్‌ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది.

అయితే తాజాగా స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్‌కు గాలం వేసింది భారతీయ జనతా పార్టీ. నవీన్‌ను బీజేపీలోకి చేర్చుకునేందకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంతనాలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. సుమారు 40 నిమిషాల పాటు కిషన్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ ఏకాంతంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి.. ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నేతలను కలుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే శ్రీశైలంను కలిసినట్లు తెలిపారు. ఇదే అంశంపై శ్రీశైలం యాదవ్ సైతం స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేవలం మర్యాదపూర్వకంగానే తమ ఇంటికి వచ్చారని వెల్లడించారు. అతిథిగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే తరహాలో మర్యాద చేస్తామన్నారు. పార్టీలోకి ఆహ్వానించేందుకు మాత్రం కాలేదని స్పష్టం చేశారు. అయితే, ప్రత్యర్థులు వాదనలు మాత్రం మరోలా ఉన్నాయి. నవీన్ యాదవ్‌ను బీజేపీలోకి రావాలంటూ కిషన్ రెడ్డి ఆహ్వానించినట్లు గుసగుసలాడుకుంటున్నారు.

చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్‌ యాదవ్‌కు జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో మంచి పట్టుంది. ఈయన కూడా ఈసారి ఇండిపెండింట్‌గా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. మజ్లిస్ టికెట్ ఆశించినప్పటికీ.. మరొకరికి సీటు ఇవ్వడంతో ఒంటరిగా బరిలోకి దిగనున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున బరిలో నిలిచిన నవీన్ కుమార్ యాదవ్ 41,656 ఓట్లు సాధించారు. 2018 లో AIMIMకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు. ఆ సమయంలో ఆయనకు 18,817 ఓట్లు పోలయ్యాయి. ఈసారి కూడా మజ్లిస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దాంతో ఆయన ఇండింపెండెంట్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా మళ్లీ పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు.

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో ఎన్నికలకు ముందు జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. జూబ్లీ హిల్స్ హైదరాబాద్‌లోని సంపన్న అర్బన్ ప్రాంతం. ఒక వేళ నవీన్ యాదవ్ నామినేషన్ ను విత్ డ్రా చేసుకుని బీజేపీకి మద్దతు ప్రకటిస్తే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతాయన్న చర్చ కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…