Telangana Election: ముగ్గురు అభ్యర్థుల బీఫాంలకు బ్రేక్.. కాంగ్రెస్ మూడో జాబితా ఆలస్యానికి కారణం ఇదేనా!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియటానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలింది. పార్టీలు ఇప్పటికే ప్రకటించిన తమ తమ అభ్యర్థులకు బీఫాంలను అందజేస్తున్నాయి. దీంట్లో అన్నింటికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులకు బీఫాంలోని అందజేయగా సెకండ్ ప్లేస్‌లో కాంగ్రెస్ పార్టీ నిలిచింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియటానికి మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలింది. పార్టీలు ఇప్పటికే ప్రకటించిన తమ తమ అభ్యర్థులకు బీఫాంలను అందజేస్తున్నాయి. దీంట్లో అన్నింటికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులకు బీఫాంలోని అందజేయగా సెకండ్ ప్లేస్‌లో కాంగ్రెస్ పార్టీ నిలిచింది.
నవంబర్ 10వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో ఆదివారం నుంచే బీఫాంలు అందించడం మొదలుపెట్టింది కాంగ్రెస్. మొత్తం 100 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 19 స్థానాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందులో భాగంగా మొదటి రోజు కాంగ్రెస్ 60 మంది అభ్యర్థులకు బీఫాంలను అందజేసింది. ఇంకా 40 మంది బీఫాంలు తీసుకోవల్సి ఉంది. అందులో మూడు బీఫాంలను కాంగ్రెస్ అధిష్టానం హోల్డ్‌లో పెట్టినట్టుగా సమాచారం. దీంతో 37 మంది అభ్యర్థులకు మాత్రమే బీ ఫాంలు ప్రస్తుతానికి రెఢిగా ఉన్నాయి.
అభ్యర్థుల ప్రకటనతో ఇప్పటికే అందరూ కదనరంగంలో దూసుకుపోతున్నారు. పలువురు అభ్యర్థులు ప్రచారంలో ఉండటంతో వారి తరఫున వారి కుటుంబ సభ్యులు బీఫాంలను అందుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా బీఫాం చేరింది. చాంద్రాయణగుట్ట అభ్యర్థి బోయ నగేష్‌కు గాంధీ భవన్ లో మొదటగా బీఫాం అందుకున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి రావి శ్రీనివాస్, నిర్మల్ నియోజక వర్గం నుంచి శ్రీహరి రావు తరపున ఆయన కూతురు బీఫామ్ తీసుకున్నారు. జగిత్యాల నియోజక వర్గం నుంచి జీవన్ రెడ్డి కుమారుడు బీఫామ్ అందుకున్నారు. ఇక రామగుండం అభ్యర్థి మకన్ సింగ్ ఠాకూర్ బీఫాంను వారి కుమారులు గాంధీ భవన్ లో అందుకున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగుతున్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ కూతురు వెన్నెల బీఫాం అందుకున్నారు. ఇక పరిగి అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి తరఫు నుంచి అతని కుమారుడు గాంధీభవన్‌లో బీఫాం తీసుకున్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డికి బీఫామ్ అందజేశారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, విశ్వనాథ్, ఉపాధ్యక్షులు నిరంజన్ తదితరులు అభ్యర్థులకు బీఫాంలు అందజేశారు.
ఇదిలావుంటే మూడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన బీఫాంలను మాత్రం ఏఐసీసీ హోల్డ్‌లో పెట్టినట్టు సమాచారం. ముగ్గురిలో చేవెళ్ల అభ్యర్థి భీమ్ భరత్, బోధ్ అభ్యర్థి వెన్నెల అశోక్, వనపర్తి నుంచి సీనియర్ నేత చిన్నారెడ్డికి సంంధించిన బీఫాంలను హోల్డ్‌లో పెట్టడంపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులుగా ప్రకటించిన వారిని మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. వనపర్తి టికెట్‌ను రాహుల్ గాంధీ హోల్‌లో పెట్టగా, బోద్ టికెట్‌ను సోనియా గాంధీ హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం. బోధ్ వెన్నెల అశోక్ స్థానాన్ని నరేష్ జాదవ్‌కు, వనపర్తి టికెట్‌ను శివసేనారెడ్డికి యూత్ కాంగ్రెస్ కోటాలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చేవేళ్ల టికట్ ప్రకటించిన భీమ్ భరత్ బీఫాం కూడా ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉంచారు. చేవెళ్ల టికెట్ ఎవరికి ఇస్తారు అనేదానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.
ఇదిలావుంటే, కమ్యూనిస్టులతో పొత్తు అంశంలో కూడా పూర్తి క్లారిటీ రాకపోవడంతో, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. నవంబర్ 10 శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుండగా, బుధవారం వరకు కాంగ్రెస్ ఫైనల్ లిస్టు వచ్చే అవకాశం కనిపించట్లేదు..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…