Surrogacy Scam: నడిబజారులో నవజాత శిశువులు… అడ్డూ అదుపులేని సృష్టి అరాచకాలు
సృష్టిలో తీయనిది అమ్మతనం. కానీ ఈ సృష్టిలో అమ్మతనమన్నది ఓ చేదునిజం. అమ్మతాకితే విషం కూడా అమృతమే...కానీ ఈసృష్టి అమ్మతాకితే అమృతం కూడా విషమే. కన్నతల్లిని అంటరానిరాలును చేసిందా డాక్టరమ్మ...దీంతో ముద్దుముచ్చటకు నోచుకోలేకపోయిందా పసికందు జన్మ. అమ్మతనం కూడా అమ్మతరమే అని నిరూపించిన డాక్టర్ నమ్రతకు ఏ శిక్ష వేస్తే చేసిన పాపం పోతుంది..? ఆవిడగారి పాపానికి ఓపాపాయి అనాధగా పడి ఉన్నాడు..వాడి బతుకుకు బరోసా ఎవరిస్తారు..?

గర్భగుడిలాంటి అమ్మఒడి..నిజంగానే పాముపడగైంది. మహాతల్లి డాక్టర్ నమ్రత అరాచకాలవల్ల. పాపం అన్నపదం కూడా పాపానపడుతుందేమో..ఈమెను పాపం అంటే. అంత పాపం కరెన్సీ రూపంలో మూటలు మూటలు కట్టుకుంది తల్లిదండ్రుల కంటిపాపలను అమ్ముకుని. అమ్మతాన్ని అంగట్లో సరుకుగా మార్చుకుని. సృష్టి అరాచకాలకు ఎందరి బిడ్డలు అనాధలయ్యారో..కన్నీళ్లతోనే ఎందరు పసిపాపలు కడుపునింపుకున్నారో… ఒంటరితనమే తోడుగా ఎందరు అనాథలు చీకట్లో మగ్గారో.. కడుపులో కలలై పెరిగిన ఆ బిడ్డ, అమ్మఒడిలో ఊయలై ఊగాలని తపనపడ్డ ఆపసికందు..తల్లి గుండెలో ఆశల సముద్రమై బయటపడ్డాక…కని పెంచిన కల తనది కాదన్న రోజు.. ఆతల్లితండ్రుల గుండెలు బద్దలవ్వవా. రాజస్థాన్‌లోని ఓ జంట పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంత మోసం. ఎంత దగా. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); ఇన్నాళ్లూ గుండెలను హత్తుకుని పెంచిన కన్నపేగు తనదికాదని..చందమామరావె జాబిల్లి రావె అంటూ గోరుముద్దలు తినిపించిన ఆ కలలపంట తమ రక్తంకాదని …ఆదంపతుల హృదయం తల్లడిల్లిపోయింది. పెంచిన మమకారం ఓవైపు…ఆమమకారం వెనుక సృష్టికార్యం సృష్టించిన అరాచకపర్వం దాగుందని తెలిసి ఆజంట పడుతున్న ఆవేదన మాటల్లో వర్ణించ తరమా.. ఏ ఆడపిల్లా జన్మలో అనిపించుకోకూడని ఒక పదం ఒకటుంది. అదే గొడ్రాలు. సంతాన భాగ్యం లేకపోతే,పెరంటానికెళ్లినా, పెళ్లికెళ్లినా. శుభకార్యానికెళ్లినా, ఆ ఇల్లాలు పడే ఆవేదన, ఆవమానం మామూలుగా ఉండదు. అందుకే ఆవమానభారం బరించలేక పిల్లల్లేనివాళ్లు ఎన్నెన్నో మార్గాలు వెతుకుతారు… ఎవరేం చెప్పినా వింటారు… ఆచరిస్తారు…ఎంతైనా ఖర్చుపెడతారు. రాజస్థాన్‌కు చెందిన గోవింద్ సింగ్, సోనియా… రాజస్థాన్‌కు చెందిన దంపతులు. సంతానలేమితో బాధపడుతూ టెక్నాలజీని నమ్ముకుని,...
