AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అప్పుడు తగ్గారు.. అందుకే ఇప్పుడు నెగ్గారు.. ఆ నియోజకవర్గంలో ఇదే టాక్..

ఆయన అప్పుడు తగ్గారు. ఇప్పుడు నెగ్గారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఈ నేతకే ఇచ్చారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్‎ను మళ్ళీ వేరే వాళ్లకు ఇవ్వాలని అధిష్టానం చెప్పింది. దీంతో ఆ టికెట్‎ను త్యాగం చేసి చివరికి ఎంపీగా గెలిచారు. అందుకే అప్పుడు తగ్గడం వల్లే ఇప్పుడు నెగ్గారు ఆ నేత ఇంతకీ ఎవరా నేత.? జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ సురేశ్‌కుమార్‌ షెట్కార్‌ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన సిట్టింగ్‌ ఎంపీ బీబీపాటిల్‌పై 47,893 ఓట్ల మొజారిటీతో గెలుపొందారు.

Telangana: అప్పుడు తగ్గారు.. అందుకే ఇప్పుడు నెగ్గారు.. ఆ నియోజకవర్గంలో ఇదే టాక్..
Telangana Elections
P Shivteja
| Edited By: |

Updated on: Jun 09, 2024 | 11:42 AM

Share

ఆయన అప్పుడు తగ్గారు. ఇప్పుడు నెగ్గారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఈ నేతకే ఇచ్చారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్‎ను మళ్ళీ వేరే వాళ్లకు ఇవ్వాలని అధిష్టానం చెప్పింది. దీంతో ఆ టికెట్‎ను త్యాగం చేసి చివరికి ఎంపీగా గెలిచారు. అందుకే అప్పుడు తగ్గడం వల్లే ఇప్పుడు నెగ్గారు ఆ నేత ఇంతకీ ఎవరా నేత.? జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ సురేశ్‌కుమార్‌ షెట్కార్‌ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన సిట్టింగ్‌ ఎంపీ బీబీపాటిల్‌పై 47,893 ఓట్ల మొజారిటీతో గెలుపొందారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 16,41,410 ఓట్లుండగా 12,25027 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌కు 5,23,919 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు 4,76,023 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ 1,17,412 ఓట్లతో మూడోస్థానానికి పరిమితమయ్యారు.

జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గంలో తొలుత కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీఆర్‌ఎస్‌ అధికారాన్ని కోల్పోవడంతో సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న బీబీపాటిల్‌ బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదనే అంచనాతో బీజేపీలో చేరారు. కమలం పార్టీ టికెట్‌పై పోటీ చేసినా ఆయనకు ఓటమి తప్పలేదు. పోస్టల్‌ బ్యాలెట్‌లో బీజేపీకి మొగ్గు చూపిన లాభం లేదు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 11,650 పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించారు. పోస్టల్‌ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్‌కు 6,207, కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌షెట్కార్‌కు 4,499, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు 666 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి. ఈసారి అనూహ్యంగా 84 బ్యాలెట్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈసారి ఉద్యోగులతో పాటు వయోవృద్ధులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్లు ఇచ్చారు. నోటాకు కూడా 44 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి.

జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో సురేష్ షెట్కార్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కన్పిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్‎ను అధిష్టానం నో చెప్పడంతో సంజీవ రెడ్డికి త్యాగం చేశారు సురేష్ షెట్కార్. సంజీవరెడ్డి గెలిపించుకోవాలని పార్టీ అధిష్టానం చెప్పడంతో ఆయన గెలుపు కోసం సురేష్ షెట్కార్ చాలానే కష్టపడ్డారు. సంజీవరెడ్డి గెలుపులో సురేష్ షెట్కార్ కీలకంగా వ్యవహరించారు. అలా ఎమ్మెల్యే టికెట్‎ను త్యాగం చేసిన ఆయనకు జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం టికెట్ కేటాయించారు. బరిలో నిలిచిన ఆయన ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి బిబి పాటిల్‎పై విజయం సాధించారు. ఇక బిఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం 2009 పునర్విభజనలో ఏర్పడింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన సురేష్ షెట్కార్‌ 17,407 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలకు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, బీఆర్‌ఎస్‌ హవా కొనసాగడంతో గులాబి పార్టీ నుంచి పోటీచేసిన బీబీపాటిల్‌ చేతిలో షెట్కార్‌ 1,44,631 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో సురేష్ షెట్కార్‌ పోటీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ ప్రస్తుత ఎన్నికల్లో పదేళ్ల కిందట తనను ఓడించిన బీబీపాటిల్‌ను 47,893 ఓట్ల తేడాతో ఓడించాడు సురేష్ షెట్కార్‌. 2024 శాసనసభ ఎన్నికల్లో నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించినప్పటికీ తానే పట్లోళ్ల సంజీవరెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపించారు. అప్పుడు తగ్గారు కాబట్టే సురేష్ షెట్కార్ ఇప్పుడు నెగ్గారు అని జోరుగా చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..