Law College: రాష్ట్రానికి ఎస్టీ సంక్షేమ గురుకుల లా క‌ళాశాల మంజూరు… స్వ‌యంగా తెలిపిన మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

రాష్ట్రానికి ఎస్టీ సంక్షేమ రెసిడెన్షియల్‌ లా కళాశాల మంజూరయ్యిందని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తెలిపారు. ఈ మేర‌కు లా కాలేజీ ఏర్పాటుకు...

Law College: రాష్ట్రానికి ఎస్టీ సంక్షేమ గురుకుల లా క‌ళాశాల మంజూరు... స్వ‌యంగా తెలిపిన మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌
Minister Satyavathi rathod
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 24, 2021 | 3:07 PM

రాష్ట్రానికి ఎస్టీ సంక్షేమ రెసిడెన్షియల్‌ లా కళాశాల మంజూరయ్యిందని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తెలిపారు. ఈ మేర‌కు లా కాలేజీ ఏర్పాటుకు సంబంధించి బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ల‌భించిన అనుమతి ప‌త్రాల‌ను ఆమె అధికారుల‌కు అందించారు. కొత్తగా ఏర్పటైన ఈ రెసిడెన్షియల్‌ లా కాలేజీతో మరో 60 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సును అందించనున్నారు. రెండో విడుత లా కౌన్సెలింగ్‌లో ఈ కాలేజీలోని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కాలేజీలోని మొత్తం 60 సీట్లలో ఎస్టీ అభ్యర్థులకు 39, ఎస్సీ 6, బీసీలకు 7 సీట్ల చొప్పున కేటాయించారు.