సేవ్ గో ర్యాలీ : గోవు జాతీయ ప్రాణిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి : యుగతులసి ఫౌండేషన్ శివకుమార్‌

రాజకీయాలు మాని ప్రతి ఒక్కరూ గోమాతను రక్షించేందుకు కృషి చేయాలన్నారు యుగతులసి ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు శివకుమార్‌. ఒక్క గోమాత..

సేవ్ గో ర్యాలీ : గోవు జాతీయ ప్రాణిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి : యుగతులసి ఫౌండేషన్ శివకుమార్‌
Follow us
Venkata Narayana

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 24, 2021 | 3:25 PM

రాజకీయాలు మాని ప్రతి ఒక్కరూ గోమాతను రక్షించేందుకు కృషి చేయాలన్నారు యుగతులసి ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు శివకుమార్‌. ఒక్క గోమాత కూడా చనిపోకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని.. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్‌ చేశారు. మన గోమాత బతికేలా రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ పాతబస్తీలో యుగతులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేవ్‌ గో ర్యాలీ ఆదివారం నిర్వహించారు. టీటీడీ మెంబర్‌, యుగతులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి..బహదూర్‌పురా మల్లన్న టెంపుల్‌ వరకు ఈ ర్యాలీ తీశారు. మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గో హత్యలను నిషేధించాలని కోరుతూ స్వామికి కరపత్రాలు సమర్పించారు.