జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రశ్నావళి, గిద్దలూరులో పోటీకి సిద్ధమా అంటూ ఛాలెంజ్

గిద్దలూరులో పోటీకి సిద్ధమా అంటూ జనసేన అధినేత పవన్‌కు సవాల్ విసిరారు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. తాను ఊడిపోతే.. ఏ శిక్షకైనా సిద్ధం....

  • Venkata Narayana
  • Publish Date - 2:49 pm, Sun, 24 January 21
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రశ్నావళి, గిద్దలూరులో పోటీకి సిద్ధమా అంటూ ఛాలెంజ్

గిద్దలూరులో పోటీకి సిద్ధమా అంటూ జనసేన అధినేత పవన్‌కు సవాల్ విసిరారు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. తాను ఊడిపోతే.. ఏ శిక్షకైనా సిద్ధం.. మీరు ఓడిపోతే.. రాజకీయ పార్టీని మూసేస్తారా అని చాలెంజ్ చేశారు. వెంగయ్య ఆత్మహత్య కేసులో తన ప్రమేయం లేదన్న రాంబాబు, తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. ప్రశ్నించడానికి వచ్చానంటున్న పవన్.. చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేసినప్పుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రశ్నించారా అంటూ క్వశ్చన్ చేశారు. గొప్పవాళ్ల పేర్లు చెప్పుకోవడం కాదు.. ఆచరించాలన్నారు. తలలు తెగిపడుతాయాని మాట్లాడుతున్నారు.. ఇందుకేనా రాజకీయాల్లోకి వచ్చిందన్నారు. భావసారుప్యత ఉన్న పార్టీలతో కలిసి పని చేస్తామంటున్నారు.. కమ్యూనిస్ట్‌లకు, బీజేపీకి ఏ సారుప్యత ఉందని రాంబాబు ప్రశ్నలు సంధించారు.