Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో యాక్షన్‌లోకి దిగిన పోలీసులు.. ఇక వారికి దబిడి దిబిడే..
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు.. డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించారు. నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి రవాణా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. డ్రగ్స్ ముఠాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ సమావేశంలోనే అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి..
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు.. డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించారు. నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి రవాణా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. డ్రగ్స్ ముఠాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలంటూ సమావేశంలోనే అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మత్తు ముఠాలను పూర్తి స్థాయిలో చిత్తు చేసేందుకు నార్కోటిక్స్ అధికారులు, హైదరాబాద్ పోలీస్ బాస్ శ్రీనివాస్‌రెడ్డి రంగంలోకి దిగారు. డ్రగ్స్ రహిత తెలంగాణే ధ్యేయంగా టీఎస్ న్యాబ్ పనిచేస్తుందన్నారు నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య. డ్రగ్స్ విషయంలో సీఎం ఆదేశాలను పాటిస్తామన్నారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసుల తరహాలో డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులకు శిక్షణ ఇస్తామన్నారు. తల్లిదండ్రులు, టీచర్లు, పోలీసులు కలిసి విద్యార్థులను డ్రగ్స్‌కి దూరంగా ఉండేలా చూడాలని సూచించారు సందీప్ శాండిల్య. సినిమా ఇండస్ట్రీపైనా ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. డ్రగ్స్ కంట్రోల్ కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని.. 8712671111 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలన్నారు.
ఈ మధ్యే హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి.. డ్రగ్స్, గంజాయి రవాణకు చెక్ పెట్టేలా దిశానిర్దేశం చేశారు. రెండు నెలల్లో హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించాలన్నారు సీపీ. హైదరాబాద్ సీటీ పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్‌ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని.. హైదరాబాద్‌లో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దన్నారు. నిజమైన బాధితులకే ఫ్రెండ్లీ పోలీస్ వర్తిస్తుందని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పోలీసు కమిషనర్. పైరవీలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అధికార, విపక్షాలు ఇప్పటికే ఏకతాటిపైకి వచ్చాయి. డ్రగ్స్ నిర్మూలనకు అంతా సహకరించాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కోరడంతో తప్పకుండా సహకరిస్తామని విపక్షం మద్దతు ప్రకటించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..