BRS vs Congress: రోజంతా కోతలు గ్యారెంటీ అన్న బీఆర్ఎస్.. లెక్కలతో సహా వివరించిన భట్టి
ఎండాకాలం వచ్చింది. రాష్ట్రమంతా కరెంట్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సమయంలో కరెంట్‌పై బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కూడా పీక్స్‌కు చేరింది. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కరెంట్‌కు ఢోకా లేదని, రైతుబంధు కూడా రంది లేకుండా పడ్డదన్నారు మాజీమంత్రి హరీష్‌రావు. కానీ కాంగ్రెస్ వచ్చాక ఏ ఊరు వెళ్లినా కరెంట్ కోతలు కనిపిస్తున్నాయని విమర్శించారు.

ఎండాకాలం వచ్చింది. రాష్ట్రమంతా కరెంట్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సమయంలో కరెంట్‌పై బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కూడా పీక్స్‌కు చేరింది. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కరెంట్‌కు ఢోకా లేదని, రైతుబంధు కూడా రంది లేకుండా పడ్డదన్నారు మాజీమంత్రి హరీష్‌రావు. కానీ కాంగ్రెస్ వచ్చాక ఏ ఊరు వెళ్లినా కరెంట్ కోతలు కనిపిస్తున్నాయని విమర్శించారు.
ఉచిత కరెంట్ 90లక్షల రేషన్ కార్డులుంటే.. 30లక్షల మందికే ఇస్తున్నారని, 60లక్షల మందికి ఎగ్గొట్టారని ఆరోపించారు హరీష్ రావు. లోక్‌సభ ఎన్నికల తర్వాత.. రోజంతా కరెంట్ లేకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే రైతుబంధు, రుణమాఫీ, 24గంటల కరెంట్ వస్తాయన్నారు హరీష్.
దీంతో రాష్ట్ర సర్కార్ గట్టిగానే సమాధానం ఇచ్చింది. ప్రజల అవసరాల విద్యుత్తు డిమాండ్‌కు తగ్గట్టుగా గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లో ఎక్కువ విద్యుత్తును సరఫరా చేసిందని, రాష్ట్ర చరిత్రలో ఈ నెల 8వ తేదీన 15,623 మెగావాట్ల విద్యుత్తును అత్యధికంగా సరఫరా చేశామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కావాలా.? కరెంట్ కావాలా.? కాంగ్రెస్ గెలిస్తే కరెంటు ఉండదని తప్పుడు ప్రచారం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడు మాసాల్లో ఎక్కువ విద్యుత్తును సరఫరా చేశామని గణంకాలతో సహా వివరించారు డిప్యూటీ సీఎం భట్టి. ఎండాకాలం కరెంట్ కోతలు ఉంటాయని బీఆర్ఎస్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందన్నారు. పీక్ అవర్స్‌లోనూ కరెంట్ కోతలు లేకుండా సరఫరా చేసే బాధ్యత తమదన్నారు.
బీఆర్ఎస్ నాయకులు కావాలనే కరెంట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు భట్టి విక్రమార్క. వాళ్లు పెట్టుకునే సభల్లో మైకులు బంద్ చేసుకుని, కరెంట్ పోతుందని వీడియోలు పెడుతున్నారని, కానీ రాష్ట్రంలో ఎక్కడా కరెంట్ కోతలు లేవన్నారు. కొన్ని చోట్ల యాన్వల్ మెయింటనెన్స్‌లో భాగంగా.. కరెంట్ ఇంటరప్షన్ ఉంటుందే తప్ప.. అవి కరెంట్ కోతలు కాదన్నారు భట్టి.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 డిసెంబర్‌లో 200 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో 207.07 మిలియన్ యూనిట్లు సరఫరా చేసిందన్నారు. అలాగే 2023 జనవరి నెలలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా, 2024 జనవరిలో 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామన్నారు. 2023 ఫిబ్రవరి నెలలో 263.38 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా, 2024 ఫిబ్రవరిలో 272.85 మిలియన్ యూనిట్లు సరఫరా చేశామన్నారు. 2023 మార్చి నెలలో 289.78 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా, 2024 మార్చిలో 295.21 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేసినట్టు చెప్పారు.
రానున్న ఏప్రిల్, మే నెలలో విద్యుత్తు డిమాండ్ మరింత పెరుగనుందని, దీనికి అనుగుణంగా విద్యుత్తును సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రానున్న వేసవిలో గరిష్ట వినియోగం 16,500 మెగవాట్ల విద్యుత్తుకు చేరినప్పటికీ తట్టుకొని నిలబడి పీక్‌టైంలో సరఫరా చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఒక నాయకుడు మాట్లాడే సమావేశంలో మైక్ కట్ అయితే కరెంటు పోయిందని ట్విట్ చేశాడని విమర్శించారు. విద్యుత్తు సరఫరా విషయంలో బిఆర్ఎస్ చేస్తున్న ఆసత్య ప్రచారంలో ఏలాంటి నిజం లేదని, ఈలాంటి అపోహలు నమ్మొద్దని, ప్రజలు నిశ్చింతగా ఉండాలని విజ్ఙప్తి చేశారు. నాణ్యమైన విద్యుత్తును అందించడానికి విద్యుత్తు లైన్ల వార్షిక నిర్వహణ, మరమత్తుల నిమిత్తం నిలిపివేసిన కరెంటును కోతలుగా చూడవద్దని, కేవలం తాత్కలిక అంతరాయంగా మాత్రమే చూడాలన్నారు.
కాంగ్రెస్ కరెంట్ సరిగ్గా ఇవ్వట్లేదని, తామున్నప్పుడే బాగుండె అని బీఆర్ఎస్ అంటుంటే.. వాళ్ల కంటే తమ హయాంలోనే ఎక్కువ కరెంట్ సరఫరా జరుగుతోందని కాంగ్రెస్ చెబుతోంది. ఎండలు ముదిరే కొద్దీ.. రెండు పార్టీల మధ్య కరెంట్ మంటలు.. ఇంకెంత మండుతాయో చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




