Hyderabad: పైన పటారం.. లోన లోటారం.. డేరాల మాటున ఖాకీల దందా..! పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు!

స్పా సెంటర్ల ముందు తమ అనుచరులను ఉంచి వెనక దందాలు నడిపిస్తున్నారట కొందరు పోలీసులు. స్పా సెంటర్ల నుండి డబ్బులను దండుకుంటున్నారట.

Hyderabad: పైన పటారం.. లోన లోటారం.. డేరాల మాటున ఖాకీల దందా..! పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు!
Spa
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Balaraju Goud

Updated on: Nov 29, 2024 | 3:25 PM

హైదరాబాద్‌లోని స్పా సెంటర్లలో చీకటి దందాకి ఏమాత్రం ఫుల్‌స్టాప్‌ పడడంలేదు. స్పా ముసుగులో జరుగుతున్న దందాపై వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా.. స్పా సెంటర్లపై దాడి చేసి, ముఠా గుట్టురట్టు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ మహానగరంలోని స్పా సెంటర్ల ముసుగులో దందాలకు కొందరు ఖాకీలే పాల్పడుతున్నట్లు తేలింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో చర్యలు మొదలుపెట్టారు.

స్పా సెంటర్ల ముందు తమ అనుచరులను ఉంచి వెనక దందాలు నడిపిస్తున్నారట కొందరు పోలీసులు. స్పా సెంటర్ల నుండి డబ్బులను దండుకుంటున్నారట. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేసరికి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా మాదాపూర్‌లోని ఓ స్పా సెంటర్‌పై దాడులు చేసిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు స్పా సెంటర్ వెనుక ఓ హోంగార్డు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈ అంశాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. ఇదిలా ఉంటే, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పా ముసుగులో గలీజ్ దందాలను నడిపిస్తున్న సెంటర్‌పై దాడులు చేశారు. పోలీసులు విచారణ చేయగా దాని వెనక ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నట్లు గుర్తించారట. సదరు ఇద్దరు కానిస్టేబుల్స్ స్పా ముసుగులో దండాలు నడిపిస్తూ ఆర్థిక లావాదేవీలను జరుపుతున్నట్లు తేలింది. ఈ అంశం డీసీపీ దృష్టికి వెళ్లడంతో ఇద్దరి కానిస్టేబుల్‌పై చర్యలను తీసుకున్నారు.

మరోవైపు స్పా సెంటర్లో నడుపుతున్న మహిళలతో కాంటాక్ట్స్‌ పెట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా పెద్ద మొత్తంలో డబ్బులను తీసుకుంటున్నారు కొంతమంది పోలీసులు. అంతేకాకుండా ఆ మహిళలతో డాన్సులు వేస్తూ, చింతలేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు బయటపడ్డాయి. బాలానగర్‌లో ఉన్న పెద్ద కాలనీలో మసాజ్ సెంటర్‌లో గుట్టుచప్పుడు కాకుండా దందాలను నడిపిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులను తీసుకుంటున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక, మరికొన్ని చోట్ల వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అందులో వీడియో కాల్స్ ఫోటోలను పెట్టి విటులను ఆకర్షించేలా ఒప్పందాలను కూడా చేసుకుంటున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో స్పా సెంటర్ల ముసుగులో కొందరు ఖాకీలు గుట్టు చప్పుడు కాకుండా ఆర్థిక లావాదేవీలతో పాటు జల్సాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలు ఉన్నతాధికారుల దృష్టికి చేరుకోవడంతో చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..