Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బైక్‌పై బ్యాగుతో అనుమానాస్పదంగా యువకుడు.. ఆపి తనిఖీ చేయగా..

ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా పండించిన గంజాయిని అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకునేవారు మన పోలీసులు. కానీ తాజాగా ఫారెన్ నుంచి గంజాయి మన ప్రాంతానికి వస్తుంది. అవును.. ఏకంగా అమెరికా నుంచి దిగుమతి అయిన గంజాయిని.. హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...

Hyderabad: బైక్‌పై బ్యాగుతో అనుమానాస్పదంగా యువకుడు.. ఆపి తనిఖీ చేయగా..
Software Engineer
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 27, 2025 | 10:04 AM

హైటెక్స్ సిటీలో ఫారిన్ గంజాయి గుప్పుమన్నది. కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పెడ్లర్లుగా మారారు. తమకున్న సాఫ్ట్‌వేర్ తెలివితో ఏకంగా విదేశాలకు చెందిన గంజాయిని తీసుకువచ్చి తోటి ఉద్యోగులకు విక్రయిస్తున్నారు. అయితే వారి ఆటకట్టించారు పోలీసులు.

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో 170 గ్రాముల విదేశీ గంజాయి సీజ్ చేశారు పోలీసులు.  అమెరికా నుంచి నగరానికి విదేశీ గంజాయి సరఫరా చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ శివరామ్‌ను‌ అరెస్ట్ చేసింది తెలంగాణ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ టీమ్. ప్రైవేట్ బస్సులో నగరానికి గంజాయి తీసుకువచ్చాడు శివరామ్.  గంజాయి సరఫరా చేస్తున్న మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అజయ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకు గంజాయి సరఫరా చేస్తోందీ ముఠా. యూఎస్‌ఏ కాలిఫోర్నియాలోని అరోమా ప్రాంతంలో ఓజీ కుష్ గంజాయిని రహస్యంగా పండిస్తున్నారు. దాన్ని అక్కడి నుంచి సీక్రెట్‌గా బెంగళూరుకి తెప్పించి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ హై క్వాలిటీ గంజాయిలో.. మరింత మత్తుకు కారకమయ్యే టెట్రా హైడ్రో క్యాన్బినాన్ అనే పదర్థాన్ని కూడా మిక్స్ చేస్తున్నారట. మన దగ్గర దొరికే సాధారణ గంజాయిలో 2 నుంచి 4 శాతం THC ఉంటే.. వారు దిగుమతి చేసుకుంటున్న గంజాయిలో అది 25 శాతం ఉంటుంది. అందువల్ల ఈ గంజాయి తీసుకుని మబ్బుల్లో తేలిపోతుంటారు కొందరు యువకులు. అందుకే అధికర ధర చెల్లించి మరీ.. దాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ గంజాయిని ఒక గ్రాము రూ.3వేలకు ఉంటుందని తెలిసింది.

మత్తు పదార్థాలు, గంజాయి రవాణా చేయొద్దు, వినియోగించవద్దని పదే పదే చెప్తున్న పోలీసులు.. ఎక్కడికక్కడ దాడులు చేసి పట్టుకుంటున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఐటీ కారిడార్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి వచ్చిన గంజాయిని పట్టుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌