Viral Video: జలకాలాటల్లో జలపుష్పాలు.. కనువిందు చేసే దృశ్యాలు.. షేర్ చేసిన స్మితా సబర్వాల్
పోచారం ప్రాజెక్ట్ వద్దకు భారీగా వచ్చిన వరదనీటిలో జలకాలాటలు ఆడుతున్నాయి చేపలు. ఈ దృశ్యాలను ఐఏఎస్ స్మిత సబర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

Telangana: తెలంగాణాలో మూడురోజులుగా పట్టిన ముసురు వీడను పొమ్మంటోంది. ఓవైపు జోరు వానలు.. మరోవైపు ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు.. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. రాష్ట్రంలోని అన్ని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. జలాశయాలు నిండు కుండల్లా మారాయి. దాదాపుగా రాష్ట్రంలో మూడో వంతుకు పైగా చెరువులు పూర్తిగా నిండినట్లు తెలుస్తోంది. అటు… మరో మూడురోజుల పాటు కుంభవృష్టి తప్పదని తేల్చేసింది హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి, వరద నీరు పోటెత్తి గోదావరి, దాని ఉపనదులు పొంగుతున్నాయి. ఈ క్రమంలోనే పోచారం ప్రాజెక్ట్ వద్ద వరద ప్రవాహ ఉధృతి పెరిగింది. దీంతో జలపుష్పాలు మస్త్ ఎంజాయ్ చేస్తున్నాయి. ప్రవాహంలో చెంగు చెంగున ఎగురుతున్నాయి. నీటి ప్రవాహానికి ఎదురీదుతూ చేపలు తుల్లి.. తుల్లి పడుతున్నాయి. ఈ దృశ్యాలను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి, ఐఏఎస్ స్మితా సబర్వాల్(IAS Smita Sabharwal)తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. పకృతి అందాలకు ఆమె ముగ్ధులయినట్లు క్యాప్షన్ బట్టి అర్థవుతుంది. కాగా ప్రజంట్ ఈ విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Nature ?? At Pocharam Project today ! #Telangana pic.twitter.com/6BNzQjfYcE
— Smita Sabharwal (@SmitaSabharwal) July 11, 2022