AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌‎ను దుర్యోధనుడు ఆవహించినట్టుగా ఉంది.. నీ మంత్రి వర్గంలో అంతా ఏక్ నాథ్ షిండేలే..

దుశ్శాసనుడు, దుర్యోధనుడు ఆవహించినట్టుగా ఉందని ఎద్దేవ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) . నిన్న కేసీఆర్ ఏకపాత్రాభినయాన్ని చూస్తే అలానే అనిపించిందన్నారు రేవంత్ రెడ్డి..

Revanth Reddy: సీఎం కేసీఆర్‌‎ను దుర్యోధనుడు ఆవహించినట్టుగా ఉంది.. నీ మంత్రి వర్గంలో అంతా ఏక్ నాథ్ షిండేలే..
Revanth Reddy
Sanjay Kasula
|

Updated on: Jul 11, 2022 | 7:44 PM

Share

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును(Cm Kcr)‎ను దుశ్శాసనుడు, దుర్యోధనుడు ఆవహించినట్టుగా ఉందని ఎద్దేవ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) . నిన్న కేసీఆర్ ఏకపాత్రాభినయాన్ని చూస్తే అలానే అనిపించిందన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చెప్పింది నిజమే.. మోడీ వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పే ఉంది కానీ మోడీకు గురువు కేసీఆర్. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నప్పుడు ఇవన్నీ మర్చిపోయారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏక్‎నాథ్ షిండేల ఉత్పత్తి ప్రారంభించింది కేసీఆర్ కదా? ప్రతిపక్ష పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్‎ను టీఆర్ఎస్‎లో చేర్చుకుని మంత్రిని చేసింది కేసీఆర్ కాదా? ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి రూపంలో ఏక్ నాథ్ షిండే‎లను తయారు చేసింది కేసీఆర్ కాదా? ఇప్పుడు ఏక్ నాథ్ షిండే భూతం కేసీఆర్‎ను పట్టుకుందా అంటూ ప్రశ్నించారు.

టీఆర్ఎస్‎లో ఉన్న వారంతా ఇతర పార్టీ నేతలే. ఏక్ నాథ్ షిండే‎కు కేసీఆర్ గాడ్ ఫాదర్. వంద ఎలుకలు తిన్న పిల్లి నీతి వాఖ్యలు చెప్పినట్లు.. సీఎం కేసీఆర్ వంద తప్పులు చేసి ఇప్పుడు నీతి వాఖ్యలు వల్లిస్తున్నారని విమర్శించారు. ఈ దేశంలో సాగు ,తాగునీరు అందించింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్‎లో బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ కాదా? బీజేపీ తప్పిదాల్లో టీఆర్ఎస్ పాత్ర ఉందన్నారు.

నాలుగురోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రావాలి..

ఇవి కూడా చదవండి

ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరించారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. నాలుగురోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రావాలని.. డెడ్‌లైన్‌ పెట్టారు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో 90లక్షల ఓట్లు సాధించి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు రేవంత్‌. అలా చేయని పక్షంలో తాను పేరు మార్చుకుంటానని ప్రతిసవాల్‌ విసిరారు.

ఏపీ వార్తల కోసం

Follow Us
బావిలో పడ్డ మృగరాజు.. ఎలా కాపాడారంటే..
బావిలో పడ్డ మృగరాజు.. ఎలా కాపాడారంటే..
జీతం 9 రూపాయలే పెంచారు.. ఓ టెకీ ఆవేదన
జీతం 9 రూపాయలే పెంచారు.. ఓ టెకీ ఆవేదన
ఆధార్‌పై రెండు ఫోన్‌ నంబర్లు ఉన్నాయంటూ కాల్‌..అసలేం జరిగిందంటే..
ఆధార్‌పై రెండు ఫోన్‌ నంబర్లు ఉన్నాయంటూ కాల్‌..అసలేం జరిగిందంటే..
ఇంట్లో నుండి వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలుడు.. కట్ చేస్తే FB కలిపింది
ఇంట్లో నుండి వెళ్లిపోయిన 13 ఏళ్ల బాలుడు.. కట్ చేస్తే FB కలిపింది
కమ్మటి వాసన, నోరూరించే రుచి.. మావా మాల్పువా ఇలా తయారు చేయండి
కమ్మటి వాసన, నోరూరించే రుచి.. మావా మాల్పువా ఇలా తయారు చేయండి
ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్‌ చేసిన నవవధువు
ఫస్ట్ నైట్ వరుడిని రూ.90 లక్షలు డిమాండ్‌ చేసిన నవవధువు
అక్కడ బాంబ్‌ ఉందంటూ ఫోన్‌ కాల్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హైదరాబాద్
అక్కడ బాంబ్‌ ఉందంటూ ఫోన్‌ కాల్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హైదరాబాద్
ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?
ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?
సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..
సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..
ఈ ఆచారం ఏందయ్యా.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
ఈ ఆచారం ఏందయ్యా.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?