AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జస్ట్‌ 4 నెలల EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమాజం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. ఈఎమ్‌ఐ కట్టలేదని అవిటివాడైన ఓ వ్యక్తి ఇంటిని సీజ్‌ చేశారు ప్రైవేటు బ్యాంక్ సిబ్బంది. లోన్ వసూళ్ల పేరుతో ఓ వికలాంగుడిపై ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Telangana: జస్ట్‌ 4 నెలల EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..
Private Bank Loan Recovery
G Sampath Kumar
| Edited By: |

Updated on: Apr 18, 2026 | 8:03 PM

Share

ఈఎమ్ఐలు కట్టట్లేదని ఓ ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వికలాంగుడి ఇంటికి తాళం వేసిన సీజ్ చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల పట్టణంలో వెలుగు చూసింది. ఇందిరానగర్‌కు చెందిన భోగం గోపాల్ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం తన ఇంటిని తాకట్టు పెట్టి కరీంనగర్‌లోని ఐకేఎఫ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.8 లక్షలు రుణంగా తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గోపాల్ ఇప్పటి వరకు క్రమంగా ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చాడు. అయితే మూడేళ్ల క్రితం షుగర్ వ్యాధి బారిన పడిన గోపాల్ ఆరోగ్యం క్షీణించడంతో ఏడాది క్రితం వైద్యులు అతని కాలు తొలగించారు. అయినప్పటికీ కుటుంబ పోషణతో పాటు రుణ చెల్లింపులు కొనసాగించాడు. ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా నాలుగు ఈఎంఐలు మాత్రమే చెల్లించలేకపోయాడు.

అయితే నాలుగు రోజుల క్రితం బ్యాంకు సిబ్బంది ఇంటికి వచ్చి రుణం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం మరోసారి వచ్చిన సిబ్బంది ఒక్కసారి బయటికి రండి.. ఒకసారి ఇంటికి తాళం వేసి ఫోటో తీసుకుంటామని చెప్పి కుటుంబాన్ని బయటకు పంపించి, అనంతరం ఇంటికి తాళం వేసి నోటీసులు అంటించి వెళ్లిపోయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో గోపాల్ కుటుంబం ఒక్కసారిగా ఆశ్రయం కోల్పోయి రోడ్డున పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు స్పందించి తాత్కాలికంగా టెంట్ ఏర్పాటు చేయగా, తర్వాత బంధువులు వారిని ఎల్లారెడ్డిపేటకు తరలించారు.

గోపాల్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, కొంత సమయం ఇవ్వాలని ఎంత బతిమాలినా బ్యాంకు సిబ్బంది స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us