AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana New CS: తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి.. సీఎంఓ నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ..

తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకం అయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana New CS: తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి.. సీఎంఓ నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ..
Telangana New Cs Shanti Kumari
Sanjay Kasula
|

Updated on: Jan 11, 2023 | 3:43 PM

Share

తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి ఖరారయ్యారు. సీఎస్‌ ఎంపికపై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కొత్త సీఎస్‌ ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకుంన్న వెంటనే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు. తనకు సిఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో బుధవారం సీఎం కేసిఆర్ ని కలిసి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన శాంతి కుమారిని డీజీపీ అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియచేశారు.

1989లో ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి.. శాంతికుమారి సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఏప్రిల్‌, 2025 వరకు శాంతికుమారి సర్వీస్‌‌లో ఉంటారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేశారు. సీఎంవోలో స్పెషల్‌ సెల్‌ సెక్రటరీగా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం అటవీశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాలకు కలెక్టర్‌‌గా కూడా పని చేశారు.

ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

డీవోపీటీ ఆదేశాలకు అనుగుణంగా సోమేశ్‌ కుమార్‌ను విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు కొత్త సీఎస్‌ను నియమించింది. అయితే ఇంకా ప్రగతిభవన్‌లోనే ఉన్నారు రామకృష్ణారావు, శాంతికుమారి. రాష్ట్ర కేడర్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వసుధా మిశ్రా, రాణి కుమిదిని, శాంతి కుమారి, శశాంక్‌ గోయల్‌, సునీల్‌ శర్మ, రజత్‌ కుమార్‌, రామకృష్ణారావు, అర్వింద్‌ కుమార్‌ ఉన్నారు.

దీంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి కొత్త సీఎస్‌ను నియమించనున్నారు. కొత్త సీఎస్‌ నియామకంతో పాటు సోమేశ్‌ కుమార్‌ ప్రస్తుతం చూస్తున్న రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, సీసీఎల్‌ఏ, గనులశాఖ బాధ్యతలను కూడా ఇతర అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం