Munugode bypoll: మునుగోడులో మారిన రాజకీయ లెక్కలు.. కారుకు ఎర్ర జెండా అండ..

TRS-CPI: మనుగోడు గట్టి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న సిపిఐ ఈ ఉప ఎన్నికల్లో ఏం చేయబోతోంది..? ఒంటరిగా పోటీచేస్తుందా? లేదా ఏ పార్టీకైనా మద్దతు ఇస్తుందా? అనే ఉత్కంఠ సాధారణంగానే ఉంటుంది. ఈనేపథ్యంలో శుక్రవారం నల్గొండలో సీపీఐ కీలక సమావేశం..

Munugode bypoll: మునుగోడులో మారిన రాజకీయ లెక్కలు.. కారుకు ఎర్ర జెండా అండ..
Munugode Bypoll Trs And Cpi
Follow us
TV9 Telugu

| Edited By: Sanjay Kasula

Updated on: Aug 11, 2022 | 4:56 PM

మునుగోడులో(Munugode bypoll) సీపిఐ(CPI) వైఖరి పైకి చూడడానికి అస్పష్టంగా కనిపించినా ఆ పార్టీ ఏం చేయబోతుందున్న విషయం స్పష్టమైంది. మనుగోడు గట్టి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న సిపిఐ ఈ ఉప ఎన్నికల్లో ఏం చేయబోతోంది..? ఒంటరిగా పోటీచేస్తుందా? లేదా ఏ పార్టీకైనా మద్దతు ఇస్తుందా? అనే ఉత్కంఠ సాధారణంగానే ఉంటుంది. ఈనేపథ్యంలో శుక్రవారం నల్గొండలో సీపీఐ కీలక సమావేశం నిర్వహించబోతుంది. మునుగోడులో పోటీపై సీపీఐ వైఖరి తేల్చేందుకు నల్గొండ జిల్లా కమిటీ భేటి కాబోతుంది. ఈ భేటిలో సిపిఐ నేతలు ఏం తేల్చబోతున్నారనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. మనుగోడులో 1962, 1985,1994 1999, 2004,2009లో సిపిఐ విజయం సాధించింది. 1992లో కాంగ్రెస్‌పై విజయం సాధించిన సిపిఐ, ఆతరువాత జరిగిన ఎన్నికల్లో 1985,1994 1999 టిడిపితో పొత్తుపెట్టుకుని సిపిఐ విజయం సాధించగా, 2004లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టకుని ఆ స్థానాన్ని గెలుచుకుంది.

2009లో మహాకూటమి టిడిపి, టిఆర్‌ఎస్‌, వామపక్షాలు కలిసి పోటీచేసిన క్రమంలో సిపిఐ విజయం సాధించింది. ఇంత గొప్ప ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న మునుగోడులో ఒంటరిగా పోటీచేసినప్పటికీ సిపిఐకి గౌరవప్రదమైన స్థానమే దక్కే అవకాశం ఉంది. అయితే సిపిఐ వైఖరి భిన్నంగా ఉంది. ఆ పార్టీ నేత మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి మాత్రం ఉప ఎన్నికలకు సిపిఐ దూరంగా ఉంటుందంటున్నారు. బీజేపీ ని ఓడించడానికి మేము పోటీ చేయకుంటే ఎదో ఒక పార్టీకి మద్దతు ఇస్తామని నర్మగర్భంగా మునుగోడులో సిపిఐ పోటీచేయడంలేదనే సంకేతాలు ఇచ్చాడు.

పోటీచేయడం వల్ల లాభం కన్న నష్టం ఎక్కువగా ఉంటుందని.. అందుకే టీఆర్‌ఎస్‌ మద్దతు ఇవ్వాలని సీపీఐ సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమచారం. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలనుకున్నప్పటికీ మునుగోడు కాంగ్రెస్‌కన్నా, టీఆర్‌ఎస్‌కు మద్దుత ఇవ్వడం వల్ల లక్ష్యం నెరవేరుతుందని సీపీఐ అ్రగనేతలు భావించి గులాబీ నీడ కిందకే ఎర్రజెండాను చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రేపు నల్గొండలో జరుగబోయే సిపిఐ నేతల భేటిలో ఈ నిర్ణయానికి అధికార ముద్ర వేసుకుంటారు.

గతంలో జరిగిన హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో సీపీఐ.. టిఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చినట్లు ప్రకటించి ఆతరువాత విత్‌ డ్రా చేసుకుంది. హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలు జరుగుతున్న కమ్రంలో ఆర్టీసీ సమ్మె జరుగడం, సమ్మెను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఐ.. టిఆర్‌ఎస్‌కు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంది. ఆ తరువాత జరిగిన దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో అచితూచి వ్యవహరంచి తటస్థ వైఖరి అవలంభించింది.

ఇప్పుడు బీజేపీని ఓడించడమే తమ అంతిమ లక్ష్యమని అందుకే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేతలు చెబుతున్నారు. సో మునుగోడు ఉప ఎన్నికను ఇంకా ఎన్నికల కమిషన్‌ ప్రకటించకముందే గులాబీ చేతికి ఎర్రజెండా చిక్కింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..