Goa Train: సీజన్‌లో భలే చాన్స్.. సికింద్రాబాద్‌ టు గోవా రైలు సర్వీస్ షురూ

అక్టోబర్ నుంచి గోవా సీజన్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ నుంచి మీరు గోవా వెళ్లాలనుకుంటున్నారా ?. అయితే మీకో గుడ్‌న్యూస్. సికింద్రాబాద్ - గోవా రైలు పట్టాలెక్కింది. మరి ఈ స్పెషల్​ రైలు టైమింగ్స్‌ ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం...

Goa Train: సీజన్‌లో భలే చాన్స్.. సికింద్రాబాద్‌ టు గోవా రైలు సర్వీస్ షురూ
Secunderabad-Goa Train
Follow us

|

Updated on: Oct 06, 2024 | 7:47 PM

సిటీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గోవా వెళ్లాలనుకునే వారి సౌలభ్యం కోసం మరో రైలును ప్రారంభించింది రైల్వేశాఖ. ప్రస్తుతం సికింద్రాబాద్‌-వాస్కోడగామా మధ్య రెగ్యులర్‌ సర్వీసుకు (17603) తీవ్ర డిమాండ్ ఉండటంతో.. మరో ట్రైన్‌ను అందుబాటులోకి తెచ్చింది.  సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ – వాస్కోడిగామా రైలును.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా  (17039) వెళ్లే ట్రైన్ బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్​(17040)కు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఆయా రోజుల్లో అక్కడ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఏటా సుమారు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాకు ట్రిప్స్ వేస్తుండగా..  అందులో 20 శాతం మంది తెలుగువారే ఉంటారు. అయితే హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లే రైలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్నారు చాలామంది టూరిస్టులు. ప్రస్తుతం నేరుగా వెళ్లే రైలు అందుబాటులోకి వచ్చింది.

నయా గోవా రైలు ఆగే స్టేషన్స్ ఇవే….

కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్​నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్​లు ఉంటాయి. ఈ నెల 4వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్ చేసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.  

అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్