AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..

తిరుపతి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. రెండు కుటుంబాల మధ్య భూవివాదం చిరిగి చిరిగి గాలి వానగా మారింది. చివరికి హత్య చేసే వరకు వెళ్లింది. ఎలాగైన స్థలాన్ని దక్కించుకోవాలనుకున్న వ్యక్తి అవతలి వ్యక్తపై కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అక్కిడి నుంచి పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..
Tirupati Murder
Raju M P R
| Edited By: |

Updated on: Apr 16, 2026 | 1:21 PM

Share

తిరుపతి రూరల్ మండలం అడపారెడ్డిపల్లి లో రెండు కుటుంబాల మధ్య స్థలం వివాదం హత్యకు దారి తీసింది. ఇళ్ల మధ్య అడుగు స్థలం కోసం ఏకంగా 40 ఏళ్లుగా రెండు కుటుంబాల మధ్య తగాదా నడుస్తోంది. తాజా ఈ స్థలం కోసం గొడవ జరగ్గా.. ఏలాగైన స్థలాన్ని దక్కించుకోవాలని డిసైడ్ అయిన ఓ వర్గానికి చెందిన వ్యక్తి మరో వర్గానికి చెందిన వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. అడపరెడ్డి పల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డి, బొమ్మి రాహుల్ రెడ్డి కుటుంబాల మధ్య అడుగు స్థలం కోసం గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. తలం మాకంటే మాకు కావాలని ఇరు వర్గాలు పట్టువదలని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా ఈ స్థలం కోసం బుధవారం మరోసారి గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో ఎలాగైన అమర్నాథ్ రెడ్డిని అడ్డుతొలగించుకొని స్థలాన్ని సొంతం చేసుకోవాలి అనుకున్న రాహుల్ రెడ్డి అమర్నాథ్ హత్యకు ప్లాన్ వేశాడు.

రాత్రి అందరూ పడుకున్న తర్వాత మెళ్లగా ఇంటి మిద్దెపై పడుకున్న అమర్నాథ్ రెడ్డి వద్దకు వెళ్లిన రాహుల్‌ రెడ్డి కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా అతన్ని హత మార్చాడు. తర్వాత చడీచప్పుడు కాకుండా అక్కడి నుంచి పారిపోయాడు. విషయం బటయకు తెలుస్తుందని.. తన తల్లిదండ్రులను తీసుకొని నిందితుడు రాహుల్ రెడ్డి ఊరు వదిలి పారిపోయాడు. ఉదయం టెరస్‌పై రక్తపు మడుగులో పడి ఉన్న అమర్నాథ్ రెడ్డిని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అయితే సరిగ్గా అమర్నాథ్ హత్య తర్వాతే రాహుల్ రెడ్డి కుటుంబ కనిపించకపోవడంతో భూ వివాధం నేపథ్యంలో వారే అమర్నాథ్‌ను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆగ్రహంతో రాహుల్ రెడ్డి ఇంటికి, బైక్ కు నిప్పు పెట్టారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పండు ప్రేమించిన అమ్మాయి ఎలా చనిపోయిందంటే..
పండు ప్రేమించిన అమ్మాయి ఎలా చనిపోయిందంటే..
శాండ్‌విచ్ ఆర్డర్ చేసి తింటుండగా నోటికి తగిలిన వస్తువు..
శాండ్‌విచ్ ఆర్డర్ చేసి తింటుండగా నోటికి తగిలిన వస్తువు..
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్ 'కరుప్పు'
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి సూర్య-త్రిషల బ్లాక్ బస్టర్ 'కరుప్పు'
వావ్ ఉమెన్స్ క్రికెట్.. అన్ని లక్షల టిక్కెట్లు సోల్డ్ ఔట్
వావ్ ఉమెన్స్ క్రికెట్.. అన్ని లక్షల టిక్కెట్లు సోల్డ్ ఔట్
రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్.. ఖాళీ స్థలంతోనే కోట్లాది యూనిట్ల
రైలు పట్టాలపై సోలార్ ప్యానెల్స్.. ఖాళీ స్థలంతోనే కోట్లాది యూనిట్ల
‘లివింగ్ రిలేషన్ కోసం నన్ను సంప్రదించండి’.. ఫోన్ నంబర్ ఇదే!
‘లివింగ్ రిలేషన్ కోసం నన్ను సంప్రదించండి’.. ఫోన్ నంబర్ ఇదే!
మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు..
మహేష్ ఆ క్యారెక్టర్ వేస్తే చాలా స్టైలీష్‏గా ఉంటాడు..
ఘోర విషాదం.. ల్యాండ్ అవుతూ పేలిపోయిన విమానం!
ఘోర విషాదం.. ల్యాండ్ అవుతూ పేలిపోయిన విమానం!
ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ..వన్‌-టు-వన్‌ ఫార్ములాతో దీదీ ప్లాన్!
ఇండియా జనబంధన్ అత్యవసర భేటీ..వన్‌-టు-వన్‌ ఫార్ములాతో దీదీ ప్లాన్!
ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం..
ఏపీ రోడ్లపై రోడ్ డాక్టర్ మ్యాజిక్.. గంటలోనే గుంత మాయం..