AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Reopening: మోగనున్న బడిగంట..తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూల్స్‌ రీ ఓపెన్‌.. ఏపీలో టైమింగ్స్‌ మార్పు

పిల్లలు రాత్రి ఆలస్యంగా నిద్రపోయి.. పొద్దెక్కాక నిద్ర లేచే రోజులు ఇక ముగిశాయి. స్కూల్‌ గేటు వేయకముందే లోపలికి పరుగులు తీసే రోజులు వచ్చేశాయి. యస్‌..! తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి మళ్లీ బడిగంట వినిపించనుంది. ఆటలు కట్టిపెట్టి పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం వచ్చేసింది.

School Reopening: మోగనున్న బడిగంట..తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూల్స్‌ రీ ఓపెన్‌.. ఏపీలో టైమింగ్స్‌ మార్పు
School Reopening
Basha Shek
|

Updated on: Jun 12, 2023 | 6:00 AM

Share

పిల్లలు రాత్రి ఆలస్యంగా నిద్రపోయి.. పొద్దెక్కాక నిద్ర లేచే రోజులు ఇక ముగిశాయి. స్కూల్‌ గేటు వేయకముందే లోపలికి పరుగులు తీసే రోజులు వచ్చేశాయి. యస్‌..! తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి మళ్లీ బడిగంట వినిపించనుంది. ఆటలు కట్టిపెట్టి పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం వచ్చేసింది. తెలుగురాష్ట్రాల్లో పాఠశాల తరగతి గది తలుపులు ఇవాళ తెరుచుకోనున్నాయి. ఇన్నిరోజులు సెల్‌ఫోన్‌ గేమ్‌లు, మైదానాల్లో పరుగులు, వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు. ఉత్సాహంగా, రెట్టించిన ఆసక్తితో పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా మానసికంగా సిద్ధం చేశారు. కాసేపట్లో బడి గంట మోగనుంది. పిల్లలు మళ్లీ బడి బాట పట్టనున్నారు. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే జూన్ 12 నుంచి బడులు తిరిగి ప్రారంభంకానున్నాయి. అయితే కొన్ని సడలింపులు చేసింది. గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 17 వరకు ఒక్క పూట బడులు పెట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నప్పటికీ ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. జూన్ 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూలు ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది ప్రభుత్వం. ఇక ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్య రాగి జావ అందించాలని ఆదేశించింది. ఉదయం 11.30 -12 గంటల మధ్య విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి వారిని ఇంటకి పంపించాలని సూచించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సెలవుల పొడిగింపు లేదు..

తెలంగాణలో కూడా ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే స్కూల్స్ తెరుచుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ 2023, 24 విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజులు పనిచేస్తాయని అధికారులు తెలిపారు. అయితే ఇన్నిరోజులు సెలవుల్లో హాయిగా గడిపి ఇప్పుడు స్కూలుకు వెళ్లడానికి పిల్లలు మొండికెస్తున్నారు. మరోవైపు పిల్లలను మొదటిరోజే పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు సైతం సుముఖంగా లేరు. కారణం మండుతున్న ఎండలు. దీంతో సోషల్‌ మీడియాలో తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని అధికారులు కొట్టిపరేశారు. పాఠశాలలకు సెలవుల పొడిగింపు లేదని అధికారులు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. దీంతో నువ్వు అడిగినవన్నీ కొనిచ్చానుగా.. వెళ్లేందుకు నువ్వు రెడీ కదా!’ అంటూ బుజ్జగింపులు మొదలుపెట్టారు తల్లిదండ్రులు. ఫస్ట్‌ డే ఎలాగైనా స్కూల్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. అదే ఉత్సాహాన్ని ఏడాదంతా కొనసాగించాలని ఆరాటపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?