CM KCR: మధ్యప్రదేశ్‌లో బలపడుతోన్న బీఆర్ఎస్.. సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరిన 200కు మందికి పైగా సీనియర్‌ నేతలు

స్వతంత్ర్య భారతం సిద్ధించి 75 ఏళ్లవుతున్నా కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య పాలన కారణంగా దేశ అభివృద్ధి కుంటుపడిందని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం దశ దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్‌కు పెద్ద అవరోధంగా పరిణమించిందని కేసీఆర్‌ మండిపడ్డారు.

CM KCR: మధ్యప్రదేశ్‌లో బలపడుతోన్న బీఆర్ఎస్.. సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరిన 200కు మందికి పైగా సీనియర్‌ నేతలు
Telangana Cm Kcr
Follow us
Basha Shek

|

Updated on: Jun 11, 2023 | 11:17 PM

స్వతంత్ర్య భారతం సిద్ధించి 75 ఏళ్లవుతున్నా కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య పాలన కారణంగా దేశ అభివృద్ధి కుంటుపడిందని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం దశ దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్‌కు పెద్ద అవరోధంగా పరిణమించిందని కేసీఆర్‌ మండిపడ్డారు. ప్రజలు, పార్టీలు ఈ విషయాన్ని గమనించాలని, చైతన్య వంతులు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపకులు, సిద్ధాంత కర్తలు, వారి తాతలు, తండ్రుల పేరుతో చేసే రాజకీయాలకు స్వస్తి పలకాలని కేసీఆర్‌ హితవు పలికారు. ఇప్పుడు దేశ ప్రజలకు ఈ పేర్లు అవసరం లేదని (నామ్ దరి నహీ కామ్ దరి హోనా చాహియే), పని చేయగలిగిన వాళ్లే కావాలని ఆయన స్పష్టం చేశారు. కాగా మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్ నుంచి పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఊపందుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ విధానాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మధ్యప్రదేశ్‌లోని సీనియర్‌ రాజకీయ నేతలు, మేధావులు, సామాజిక వర్గాలు, తదితరులు పార్టీలో చేరుతున్నారు. మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్‌ను మధ్యప్రదేశ్ బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్‌గా నియమించిన తర్వాత పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. పటేల్‌ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సహా మరో రెండు వందల మంది కీలక రాజకీయ నేతలు ఆదివారం అధినేత సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా నేతలకు బీఆర్‌ఎస్‌ అధినేత గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు..

మధ్యప్రదేశ్ BRS సమన్వయకర్త మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ నేతృత్వంలో పార్టీలో చేరిన వారిలో… చందవాడా జిల్లా, జున్నార్ దేవ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామ్ దాస్ వైకే సర్వజన్ కళ్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభరామ్ బాలవి, భువన్ సింగ్ కోరమ్, లక్ష్మణ్ మాస్కోలే తదితరులు ఉన్నారు. వీరితో పాటు దాదాపు 200 మంది సీనియర్ రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, ఇతరులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ నీరు, సాగుభూమి, కరెంటు కోసం బొగ్గు నిల్వలు, వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం వంటి సహజ వనరులతో దేశం ధన్యమైందని, ఇంత జరుగుతున్నా దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. కేంద్రం దృష్టి సారించకపోవడమే ఇందుకు కారణమని, 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దళితులు, వెనుకబడిన వర్గాలతో సహా అన్ని ఇతర వర్గాలు అన్యాయానికి గురయ్యాయని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని అధిగమించాలంటే పార్టీలు మారకుండా వారి ఆశయాలను సాధించుకునే దిశగా కేంద్రం మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం పిలుపునిచ్చారు. ఒక పార్టీ ఓడిపోయి మరో పార్టీ గెలిస్తే ఆ పార్టీల పేర్లు మారుమోగుతాయి. ఆ నాయకుల పేర్లు మారతాయి కానీ ప్రజలకు ఏమీ జరగదు. పని తీరు (నామ్ బదల్ నేసే కుచ్ నహీ హోతా…కామ్ బదల్నా చాహియే)లో మార్పు తీసుకొచ్చే ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘం విఫలం

బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తే దేశ ప్రజలకు రెండేళ్లపాటు 24 గంటల కరెంట్‌ ఇస్తామని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. బీఆర్‌ఎస్ పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, భారతదేశాన్ని మార్చే లక్ష్యం అని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ధ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపిన ముఖ్యమంత్రి తెలంగాణలో అమలు చేస్తున్న దళిత బంధు రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, పింఛన్ల మద్దతు వంటి పథకాలను వివరించారు. తెలంగాణలో అమలు చేస్తున్నప్పుడు మధ్యప్రదేశ్‌లో ఎందుకు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఇదే ప్రశ్న కేంద్రాన్ని అడగాలి. మన సమస్యలను మనం పరిష్కరించుకోవాలన్నారు. ‘ స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా దేశంలో ఆదివాసీ, దళితులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరగలేదు. కనీస జీవన ప్రమాణాలు లేకుండా ఉత్తర భారతదేశం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశం మార్పు కోరుకుంటోందని, మేధావులు ఈ దిశగా ఆలోచించాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేధావులు ఏకతాటిపైకి రావాలి. ‘దిల్ వాలే దిమాఖ్ వాలే’ ఐక్యత అవసరం. కొన్ని పార్టీలు తప్పుడు వాగ్దానాలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. అక్రమాలు, అక్రమాలను అరికట్టడంలో ఎన్నికల సంఘం విఫలమైంది.

ఇవి కూడా చదవండి

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో త్వరలో బీఆర్‌ఎస్ పార్టీ సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచార వాహనాలను ఏర్పాటు చేయాలని, పార్టీ సిద్ధాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ సూచించారు.. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయలన్నారు. ప్రతి గ్రామంలో కాపు దళిత మహిళ యువ బీసీ వంటి 9 కమిటీలు వేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు శంకరన్న డోంగ్డే, మాణిక్ కదమ్, హిమాన్షు తివారీ, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పార్టీ నాయకులు డి.శ్రవణ్, మెట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.