TS News: రాత్రుళ్లు వింత శబ్దాలు.. జనాలు హడల్‌.. మగవాళ్లను బలితీసుకుంటున్న వింత ఆకారం!

అడవుల జిల్లా ఆదిలాబాద్‌లోని అమాయక ఆదివాసీ గూడెం ఇది. చుట్టూ పచ్చని ప్రకృతి.. దట్టమైన అటవీ ప్రాంతం.. వందల ఎకరాల సాగు భూమి...

TS News: రాత్రుళ్లు వింత శబ్దాలు.. జనాలు హడల్‌.. మగవాళ్లను బలితీసుకుంటున్న వింత ఆకారం!
Horror
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 10, 2021 | 2:14 PM

అడవుల జిల్లా ఆదిలాబాద్‌లోని అమాయక ఆదివాసీ గూడెం ఇది. చుట్టూ పచ్చని ప్రకృతి.. దట్టమైన అటవీ ప్రాంతం.. వందల ఎకరాల సాగు భూమి.. పాడిపంటలు.. ఏ మాయా మర్మం తెలియని జనం. కానీ ఇప్పుడా గ్రామంలో వరుస మరణాలు ప్రజల్ని భయపెడుతున్నాయి…ఇళ్లు , పొలాలు, వదిలి జనాలు పారిపోవాల్సిన పరిస్థితి నెలకొంది..ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం అంబుగావ్ గ్రామపంచాయితీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామం బేతాల్ గూడ పరిస్థితి ఇది..ఇంతకీ ఇక్కడ ఏం జరిగింది.

వరుస మరణాలతో దడల్…

అసలే ఏజెన్సీ ప్రాంతం.. పైగా అమాయక గిరిజనం. ఏదో తెలియని మాయదారి భూతం తమని మింగేస్తుందనే మూడనమ్మకం.. ఇంకో వైపు‌ కేవలం మగవాళ్లు మాత్రమే చనిపోతుండటం.. దీంతో ఊరికి ఏదో కీడు జరుగుతుందన్న భయంతో బేతాల్ గూడ గిరిజనులు గ్రామాన్ని వదిలి వెళ్తున్నారు. ఈ బేతాల్ గూడ గ్రామంలో మొత్తం 18 ఇండ్లున్నాయి.. 62 మంది జనాభా. ఏ చీకు చింత లేకుండా వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగించారు. కానీ గత నెలన్నర రోజుల వ్యవధిలో ఏకంగా 9 మంది మగవాళ్లు ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళుతూ ప్రాణాలు వదలడం ఆ గ్రామాన్ని షాక్ కు గురి చేసింది. రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరడం ఆ మరుసటి రోజే మరణించడం.. ఏదో తెలియని భూతం మా మగవాళ్లను బలి తీసుకుంటుందని బలంగా నమ్మారు. వరుస మరణాలు మరింత భయబ్రాంతులకు గురి చేయడంతో ఊరిని ఖాళీ చేసి కట్టు బట్టల తో పక్క గ్రామాలకు నిరాశ్రయులుగా వెళ్లిపోయారు.

ఎన్నో పుకార్లు.. మరెన్నో అనుమానాలు…

గత నెల 8న బేతాల్ గూడ గ్రామ పెద్ద ఆత్రం భీమ్‌రావు అకస్మాతుగా మృతి చెందాడు. ఆ తరువాత రెండు వారాలకు పెద్ద అల్లుడు చనిపోయాడు.. ఆ మరుసటి రోజే భీంరావ్ మరో అల్లుడు మృత్యవాత పడ్డాడు. కేవలం నెల వ్యవధిలోనే ఆత్రం భీంరావు కుటుంబంలో ముగ్గురు ఎలాంటి వ్యాధులు లేకుండానే మృతి చెందడంతో గ్రామస్థుల్లో భయం పెరిగింది. ముందుగా ఏ దెయ్యమో పట్టిందని పూజలు చేస్తే తగ్గిపోతుందని బావించారు కానీ.. ఆ మరణాల సంఖ్య అంతకంతకు పెరగడంతో కనిపించని‌ ఏదో భూతం మా గ్రామాన్ని బలి తీసుకుంటుందని అనుమానం మరింత పెంచుకున్నారు.

అంతకు మూడు నెలల ముందు ఆత్రం కుటుంబంలోని ఇద్దరు యువకులు ఒక వృద్దుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండానే చనిపోయారు. దీంతో బేతాల్ గూడ ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు రాత్రైతే వినిపించే వింత శబ్దాలు మరింత భయాందోళనకు గురి చేశాయి. అడవన్నాక శబ్దాలు మాములే.. నిర్మానుష్యంగా ఉండటంతో జంతువుల‌ అరుపులు సైతం వింతవింతగా వినిపిస్తాయి.. ఆదివాసీలు వాటికెప్పుడు భయపడలేదు కూడా.‌. కానీ ఈ ఆదివాసీ గూడెన్ని మాత్రం ఓ వింత ఆకారం భయాందోళనలకు గురి చేసింది. ఆరోగ్యంగా ఉన్న ఇంటి పెద్ద హఠాత్తుగా చనిపోవడం మరింత కలవర పెట్టింది. రాత్రి దాటిన తరువాత పొలం పనులకు వెళ్లి వచ్చిన వ్యక్తులు ఉదయం శవంగా మారడం గుండెల్లో గుబులు రేపింది. దీంతో ఊరికి అరిష్టం పట్టుకుందని.. ఇళ్లు వదిలి ప్రాణాలను‌ కాపాడుకునేందుకు పక్క గ్రామాలకు వెళ్లిపోయారు బేతాల్ గూడ వాసులు.

ఈ గ్రామ జనాభా 68…కాగా, వరుస మరణాలతో ఆ సంఖ్య 59 కి చేరింది. 5 ఏళ్ల లోపు పిల్లలు 14 మంది.. 10 ఏళ్ల లోపు చిన్నారులు 13 మంది.. వరుస మరణాలతో 9 మంది వితంతువులుగా మారగా.. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు ఆరుకు చేరాయి. అయితే, ఈ గ్రామానికి మంత్రాలు చేశారని‌ కొందరు.. ఓ భూతం మా గ్రామంలో తిరుగుతుందని మరికొందరు.. మగ వాళ్లను మాత్రమే చంపే వింత ఆకారం మా గ్రామంలో సంచరిస్తుందని ఇంకొందరు చెప్తుంటే పక్క గ్రామాల ప్రజలు మాత్రం అవేమి కావు… ఇక్కడి నీళ్లే ఊరోళ్ల ప్రాణాలు తీస్తున్నాయంటున్నారు.

ఖాళీ చేస్తోన్న ప్రజలు…

అయితే, ఈ గ్రామంలోని ప్రజలు మాత్రం మా కన్న ఊరే మమ్మల్ని కాటికి పంపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేతాల్ గూడా లో ఉంటే చావు తప్పదని అందుకే అంబుగావ్ గ్రామానికి వలస వచ్చామని చెపుతున్నారు. తమ గ్రామానికి ఏదో పీడ పట్టిందని.. మగ వాళ్లను మాత్రమే మింగేస్తుందని.. ఇకపై బేతల్‌గూడకు చచ్చినా వెళ్లేది లేదని ఖరాఖండిగా చెపుతున్నారు. కనిపించని ఆకారం ఉందో లేదో తెలియదు కానీ వీరిలో బలంగా నాటుకు పోయిన మూఢనమ్మకం మాత్రం ఊరిని ఖాళీ చేయించింది.

Also Read:

లైవ్‌లో చిరుత వేటను మీరెప్పుడైనా చూశారా.? అయితే ఈ షాకింగ్ వీడియో చూడండి.!

పోస్టాఫీసు సూపర్ స్కీమ్.. ప్రతీ నెల రూ. 2 వేలు జమతో.. రూ. 1.39 లక్షలు పొందొచ్చు.!

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో