Telangana: విద్యార్థి సాత్విక్ సూసైడ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. విచారణ కమిటీ ఏం తేల్చిందంటే..
శ్రీచైతన్య విద్యార్ధి సాత్విక్ సూసైడ్ ఇన్సిడెంట్‌లో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయ్. సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్‌కి అసలు అడ్మిషనే లేదని తేల్చింది ఎంక్వైరీ కమిటీ.
శ్రీచైతన్య విద్యార్ధి సాత్విక్ సూసైడ్ ఇన్సిడెంట్‌లో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయ్. సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్‌కి అసలు అడ్మిషనే లేదని తేల్చింది ఎంక్వైరీ కమిటీ. ఎక్కడో అడ్మిషన్ ఉంటే, నార్సింగ్ క్యాంపస్‌లో క్లాసులకు అటెండ్ అవుతున్నాడంటూ సంచలన రిపోర్ట్ ఇచ్చింది విచారణ కమిటీ.
క్లాసులేమో శ్రీచైతన్యలో.. సర్టిఫికెట్లేమో చిన్న కాలేజీల పేరుతో.. ఇది అన్ని కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతున్న అక్రమాలేనంది ఎంక్వైరీ కమిటీ. ఇది రూల్స్‌కి విరుద్ధమైనా దాదాపు కార్పొరేట్ విద్యాసంస్థలు ఇదే చేస్తున్నాయని చెప్పింది. అయితే, నార్సింగ్ శ్రీచైతన్య ఇన్సిడెంట్‌ని కేస్ స్టడీగా తీసుకుని అడ్మిషన్స్ అక్రమాలపై అన్ని కాలేజీల్లో సోదాలు చేయాలని సూచించింది.
ఒక కాలేజీలో అడ్మిషన్, మరో కాలేజీలో క్లాసులు, ఇది ఇంటర్ బోర్డుకు తెలియకుండానే జరుగుతోందా?. ఎప్పట్నుంచో కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతోన్న ఈ బాగోతంపై ఎందుకు చర్యల్లేవ్. నార్సింగ్ క్యాంపస్‌లో సాత్విక్‌కి అడ్మిషన్ లేదన్నది నిజమే కావొచ్చు. కానీ, అన్ని కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి అంటూ ఎంక్వైరీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై ఇంటర్ బోర్డ్ ఏం సమాధానం చెబుతుంది.
ఒక కాలేజీలో అడ్మిషన్ ఇచ్చి, మరో క్యాంపస్‌లో క్లాసులు నిర్వహిస్తుంటే ఇంటర్ బోర్డ్ ఏం చేస్తోందని ప్రశ్నించారు ప్రభుత్వ జూనియర్ కాలేజీల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి. ఇది ఎప్పట్నుంచో జరుగుతోందని, కనీసం ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నిలదీస్తున్న పేరెంట్స్..
విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంటర్ బోర్డుకు పట్టదా? ఎందుకీ నిర్లక్ష్యం! అంటున్నారు తల్లిదండ్రులు. నార్సింగి శ్రీచైతన్య విద్యార్ధి సాత్విక్ సూసైడ్ ఇన్సిడెంట్‌పై పర్టికులర్ యాక్షన్ ఏదని ప్రశ్నిస్తున్నారు. అక్రమాలపై పాల్పడుతోన్న కార్పొరేట్ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలంటున్నారు విద్యావేత్తలు, పేరెంట్స్. మరో విద్యార్ధి బలికాకముందే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సంచలన విషయాలు బయటపెట్టిన సాత్విక్ ఫాదర్..
టీవీ9తో ఫోన్ లైన్లో మాట్లాడిన సాత్విక్ ఫాదర్ రాజు.. శ్రీచైతన్య నార్సింగ్ క్యాంపస్‌పై సంచలన విషయాలు బయటపెట్టారు. అడ్మిషన్, ఫీజులు అన్నీ నార్సింగి అడ్రస్‌తోనే ఇచ్చారని చెప్పారు. ఇంటర్ బోర్డుకు తెలియకుండానే అక్కడ కాలేజీ నడుస్తోందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ విద్యార్ధి చనిపోతే అధికారులకు అసలు పట్టింపే లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పోస్టుమార్టం ఉస్మానియాలో జరిగితే గాంధీ అని రాశారని, అధికారుల నిర్లక్ష్యానికి ఇంతకంటే రుజువు ఇంకేం కావాలన్నారు రాజు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..