MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్‌లో ట్విస్ట్ .. మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సర్పంచ్ నవ్య

ఆమె భర్తతో కలిసి రాజయ్య ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ప్రెస్‌మీట్‌లో మరో ట్విస్ట్‌ ఇచ్చిన సర్పంచ్‌ నవ్య. రాజయ్య పక్క కూర్చుని ఆయనపై తీవ్ర ఆరోపణ చేశారు నవ్య.

MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్‌లో ట్విస్ట్ .. మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సర్పంచ్ నవ్య
Sarpanch Navya
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 12, 2023 | 4:14 PM

వరంగల్ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. జానకీపురం సర్పంచ్ నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య వెళ్లారు. సర్పంచ్ నవ్య, ఆమె భర్తతో కలిసి రాజయ్య ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ప్రెస్‌మీట్‌లో మరో ట్విస్ట్‌ ఇచ్చిన సర్పంచ్‌ నవ్య. రాజయ్య పక్క కూర్చుని ఆయనపై తీవ్ర ఆరోపణ చేశారు నవ్య. ఎమ్మెల్యే రాజయ్య పక్కన ఉండగానే ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. నేను చేసిన ప్రతి ఆరోపణ నిజం అంటూ తేల్చి చెప్పారు సర్పంచ్‌ నవ్య.

నన్ను లైంగికంగా వేధించిన వెధవల భరతం పడతానంటూ హెచ్చరించారు. నాపై జరిగిన లైంగిక వేధింపులపై పోరాటం చేస్తానంటూ సర్పంచ్‌ నవ్య హెచ్చరించారు. లైంగికంగా వేధించేవారికి అక్కాచెల్లెళ్లు లేరా ..  మహిళలను వేధిస్తే కిరోసిన్‌ పోసి తగులబెడుతా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను నిన్నో మాట ఇవాళో మాట మాట్లాడను.. నా పై లైంగిక వేధింపులపై పోరాటం చేస్తా.. ఆడవారి పట్ల పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఊరుకోను.. నేను డబుల్ గేమ్ ఆడనంటూ తేల్చి చెప్పారు.

నేను చేసిన ప్రతి ఆరోపణ నిజం. మహిళలు అనేక విధాలుగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. నన్ను లైంగిక వేధింపులకు గురి చేసిన వెధవల భరతం పడతాను. లైంగికంగా వేధించే వారికి అక్క చెళ్లెల్లు లేరా అంటూ ప్రశ్నించిన నవ్య. టీఆర్‌ఎస్  పార్టీలో పెద్ద స్థాయిలో ఉన్న అందరికీ సూటిగా ప్రశ్నించారు. ఆడవారిని గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు.

సర్పంచ్ నవ్య  మాట్లాడుతున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం