Rythu Bharosa: రైతు భరోసాపై రేవంత్ సర్కార్ షాకింగ్ డెసిషన్.. వారికి డబ్బులు కట్..! కోత విధింపుకు రెడీ..
తెలంగాణలోని రైతు భరోసా లబ్దిదారులకు షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. పంట సాగు చేయని భూములను శాటిలైట్ సర్వే ఆధారంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రక్రియ పూర్తవ్వగా.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ఈ నివేదికలో పలు కీలక విషయలు వెల్లడయ్యాయి.

తెలంగాణ రైతులకు ప్రభుత్వం త్వరలో షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. కేవలం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఇందుకోసం సాగు భూములను గుర్తించేందుకు వ్యవసాయ వర్సిటీతో ప్రభుత్వం శాటిలైట్ సర్వే గత కొద్ది నెలలుగా చేయిస్తోంది. ఈ సర్వే తాజాగా పూర్తవ్వగా.. ఓ నివేదిక సిద్దం చేశారు. 10 వేల రెవెన్యూ గ్రామాల్లో మ్యాప్‌ల ఆధారంగా పంటల విస్తీర్ణాన్ని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నమోదు చేసింది. ఈ నెల 6న ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనుంది. ఈ సర్వేలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి.
10 శాతం భూములకు కట్..?
అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో 10 శాతం సాగు భూముల్లో పంటలు వేయలేదని తేలింది. దీంతో ఈ భూములకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం నిలిపివేయనుందని తెలుస్తోంది. కేవలం ప్రస్తుతం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పంట సాగు చేయని భూములకు రైతు భరోసా కట్ చేయనుంది. దీంతో సర్వేలో తేలిన పంట సాగు చేయని భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నారని తెలుస్తోంది. రైతు భరోసా కోసం రైతులందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ శాటిలైట్ సర్వే పూర్తి కాకపోవడం వల్ల నిధుల జమలో ఆలస్యం జరిగింది. కానీ త్వరలో ప్రభుత్వానికి శాటిలైట్ సర్వే రిపోర్ట్ అందనుండటంతో.. త్వరలోనే రైతు భరోసా నిధులు ప్రభుత్వం విడుదల చేయనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
వారికి రైతు భరోసా నిధులు బంద్?
సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సి ఉంది. పండక్కి డబ్బులు అకౌంట్లో పడతాయని రైతులు కూడా ఆశించారు. జనవరి చివరి వారంలో అయినా ప్రభుత్వం వేస్తుందని ఊహించగా చుక్కెదురైంది. శాటిలైట్ సర్వే రిపోర్ట్ రావడంతో త్వరలోనే రైతు భరోసా ప్రభుత్వం విడుదల చేసే అవకాశముంది. గత వానాకాలం సీజన్‌లో 69 లక్షల మంది రైతులకు అందించారు. కానీ యాసంగి సీజన్ మొదలై రెండు నెలలు గడుస్తున్నా.. ఇంకా ప్రభుత్వం జమ చేయలేదు. శాటిలైట్ సర్వే ప్రకారం ఈ సారి రైతు భరోసాలో కోత పెట్టనుంది. దీంతో ఈ సారి కొంతమంది రైతులకు రైతు భరోసా నిధులు బంద్ కానున్నాయని చెబుతున్నారు. ప్రతీ గుంటలో పంట సాగు అవుతుందా.. లేదా అనేది శాటిలైట్ సర్వే ఆధారంగా గుర్తించారు.
