AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి రోజూ పండగే. ప్రతి ఘట్టం అద్భుతం.. సమతా కుంభ్‌-2026 నాల్గో బ్రహ్మోత్సవాలు

ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్య -108 దివ్యదేశాల నాల్గవ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.సుప్రభాతం.. ప్రాత:కాల ఆరాధన..హోమాలతో సాకేత రాముడి సన్నిధి ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. ఇవాళ మూడో రోజు ఎన్నో విశేష కార్యక్రమాలున్నాయి. అవేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

ప్రతి రోజూ పండగే.  ప్రతి ఘట్టం అద్భుతం.. సమతా కుంభ్‌-2026 నాల్గో బ్రహ్మోత్సవాలు
Samatha Kumbh Muchintal, 108 Divya Desams Brahmotsavam
Ravi Kiran
|

Updated on: Feb 01, 2026 | 7:35 AM

Share

బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు విష్వక్సేన ఆరాధన..హోమశాలలో 9 అగ్నికుండాల్లో అగ్నిప్రతిష్ఠ నిర్వహించారు . సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుడ పటాన్ని  ఆవిష్కరించారు. దివ్యసాకేతం నుంచి  శ్రీరామచంద్రప్రభువు సూర్యప్రభ వాహనంపై తరలివచ్చి ధ్వజారోహణ కార్యక్రమానికి  శుభారంభం  చేశారు. శ్రీశ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామిజీ ఆధ్వర్యంలో భక్తులకు  గరుడ ప్రసాద వితరణ చేశారు. సామూహిక విష్ణు సహస్రనామ పారాయణంలో భక్తులు భారీ గా పాల్గొన్నారు. ఇక గోదామ్మ వైభవాన్ని కళ్లకు కట్టిన వెయ్యిమంది బంగారు తల్లుల నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.  చిన్నారులకు మంగళాశాసనాలు అందించారు చిన్నజీయర్‌ స్వామిజీ.

శ్రీరంగాధీశుడు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు, 1 నుంచి 18 దివ్యదేశాల్లోని పెరుమాళ్లకు గరుడ వాహన సేవ కనులపండువగా సాగింది. బ్రహ్మోత్సవాల సారధి సాకేత రామచంద్ర ప్రభువు కు  శేషవాహన సేవ  కనులపండగువగా నిర్వహించారు. సీతాసమేత రామయ్యను కనులారా తిలకించి భక్తితో పరవశించారు భక్తులు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మూడో రోజు  దివ్యదేశమూర్తులకు తిరుమంజన సేవ, శ్రీరామ అష్టోత్తర శతనామార్చన, సాయంత్రం చంద్రవాహన సేవ, దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు సహా మరెన్నో విశేష కార్యక్రమాలు ఉన్నాయి. వన్ వరల్డ్- వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్‌ సాయి సమతా స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు.

త్రిదండి చిన్నజీయర్‌స్వామితో సమావేశమై వన్ వరల్డ్- వన్ ఫ్యామిలీ మిషన్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను  వివరించారు.సమతామూర్తి కేంద్రం విశ్వ ఐక్యతకు ప్రతీక అన్నారు సద్గురు మధుసూదన్ సాయి. సమతా కుంభ్‌-2026 .. నాల్గో బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ పండగే.  ప్రతి ఘట్టం అద్భుతం.. ప్రతీ దృశ్యం అనిర్వచనీయం.శ్రీరామానుజాచార్య – 108 దివ్యదేశాల  నాల్గవ బ్రహ్మోత్సవాలకు అందరూ ఆహ్వానితులే. సకల జనులకు ప్రేమపూర్వక  శుభ స్వాగతం!!