AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటు కోడి Vs బ్రాయిలర్ కోడి.. ఆరోగ్యానికి ఏది మంచిది..? అసలు నిజాలు తెలిస్తే షాకే..

Broiler Chicken vs Country Chicken: చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. కానీ మనం తినే కోడి మాంసం మన శరీరానికి బలాన్ని ఇస్తుందా లేక రోగాలను తెస్తుందా? తక్కువ ధరకే దొరుకుతున్న బ్రాయిలర్ కోడి వెనుక ఉన్న ప్రమాదాలేంటి? గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే నాటు కోడి ఎందుకు ఆరోగ్యానికి శ్రీరామరక్ష? కేలరీలు, ప్రోటీన్లు, కొవ్వు శాతంలో ఈ రెండింటి మధ్య ఉన్న తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నాటు కోడి Vs బ్రాయిలర్ కోడి.. ఆరోగ్యానికి ఏది మంచిది..? అసలు నిజాలు తెలిస్తే షాకే..
Broiler Chicken Vs Country Chicken
Krishna S
|

Updated on: Feb 01, 2026 | 7:30 AM

Share

ముక్క లేనిదే ముద్ద దిగని నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ అంటే ప్రాణం. చికెన్ ఫ్రై, బిర్యానీ, సూప్.. ఇలా వెరైటీ ఏదైనా సరే లాగించేస్తారు. అయితే మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే ఫారం కోడి మంచిదా? లేక పల్లెటూళ్లలో సహజంగా పెరిగే నాటు కోడి మేలా? ఈ రెండింటిలో పోషకాలు ఎందులో ఎక్కువ ఉన్నాయి? అనేదానికి వైద్య నిపుణులు ఆసక్తికర సమాధానాలు తెలిపారు. చాలా మంది తక్కువ ధరకు లభిస్తుందని బ్రాయిలర్ చికెన్‌ను కొనుగోలు చేస్తారు. కానీ వీటి పెంపకం వెనుక ఉన్న చేదు నిజం మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. బ్రాయిలర్ కోళ్లను త్వరగా పెంచడానికి హార్మోన్లు, యాంటీబయాటిక్స్ విరివిగా ఉపయోగిస్తారు. వీటిని తరచూ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.

నాటు కోడి.. పోషకాల గని

ప్రకృతి ఒడిలో సహజమైన ఆహారం తింటూ పెరిగే నాటు కోడి మాంసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 100 గ్రాముల బ్రాయిలర్ చికెన్‌లో 150 కేలరీలు ఉంటే నాటు కోడిలో కేవలం 120 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువ. దీనిలోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. నాటు కోడి మాంసంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ముఖ్యమైన పోషకాలు ఇవే

నాటు కోడిలో మన శరీరానికి అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి..

ప్రోటీన్ – విటమిన్లు: కండరాల పుష్టికి ప్రోటీన్, ఎముకల బలానికి విటమిన్ డి, ఇ మరియు బి-కాంప్లెక్స్ లభిస్తాయి.

ఖనిజాలు: జింక్, సెలీనియం, ఐరన్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

వెయిట్ లాస్: తక్కువ కొవ్వు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి నాటు కోడి ఒక అద్భుతమైన ఎంపిక.

ఏది మంచిది..?

ధర కొంచెం ఎక్కువైనా, రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే నాటు కోడిని ఎంచుకోవడమే ఉత్తమం. సరైన పద్ధతిలో వండుకుని తింటే నాటు కోడి ద్వారా అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.