RTC Bus: 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ గ్రామంలో తొలిసారి ఆర్టీసీ బస్సు పరుగులు.. మురిసిపోయిన గ్రామస్తులు..
ములుగు జిల్లా ఏజెన్సీలోని అనేక గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదంటే నమ్మశక్యం కాదు. అలాంటి గ్రామాల్లో మంత్రి సీతక్క గ్రామం కూడా ఒకటి. ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామం సీతక్క స్వగ్రామం. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని ఒక మారుమూల పల్లె ఇది.

ములుగు ఎమ్మెల్యే సీతక్కను మంత్రి పదవి వరించగానే ఆమె గ్రామంలో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. అధికారులు ఉరుకులు పరుగులతో ఆమె గ్రామంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఆ ఊరి మొఖం చూడని ఆర్టీసీ బస్సు, ఆమె స్వగ్రామానికి పరుగులు పెట్టింది.. సీతక్క స్వగ్రామం మీదుగా ఎనిమిది గ్రామాలను కలుపుతూ RTC బస్సు రావడంతో గ్రామస్తుల ఆనందంతో మురిసిపోయారు. మా ఊరి బిడ్డ మంత్రి అవ్వడం వల్లే ఊరికి బస్సు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు…
ములుగు జిల్లా ఏజెన్సీలోని అనేక గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదంటే నమ్మశక్యం కాదు. అలాంటి గ్రామాల్లో మంత్రి సీతక్క గ్రామం కూడా ఒకటి. ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామం సీతక్క స్వగ్రామం. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని ఒక మారుమూల పల్లె ఇది. అలాంటి గ్రామానికి ఇప్పుడు సీతక్క మంత్రి కాగానే ఆర్టీసీ బస్సు పరుగులు పెట్టింది. ములుగు నుండి మదనపల్లి, జగ్గన్నపేట, చింతలపల్లి, పత్తిపల్లి మీదుగా పొట్లాపూర్ వరకు RTC అధికారులు రోజుకు మూడు ట్రిప్పులు నడుపుతున్నారు.
ఈ గ్రామాల ప్రజలు ఒకప్పుడు మండల కేంద్రానికి రావాలన్నా, జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు, సొంత వాహనాలు మీదే వచ్చేవారు. గతంలో అనేక సందర్భాలలో తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సు వేయండని అధికారులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాలు సమర్పించారు. కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ గ్రామ వైపు చూసిన నాధుడే లేడు. సీతక్క కూడా అనేక సందర్భాలలో అధికారులకు విన్నవించారు. మా గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు. కానీ ఎవరు పట్టించుకోలేదు.
కానీ సీతక్క మంత్రి కాగానే అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆ గ్రామానికి వారాంతట వారే ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. జగ్గన్నపేటతో పాటు ఎనిమిది గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్సు పరుగులు పెట్టడం మొదలు పెట్టింది. ఎవరూ ఊహించిన విధంగా జగ్గన్నపేట గ్రామంలో ఆర్టీసీ బస్సు హారన్ విన్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. మా ఊరికి బస్సు రావడం ఏంటని ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ తర్వాత వారికి అర్థమైంది సీతక్కకు మంత్రి పదవి రావడం వల్లే మా ఊరికి బస్సు వచ్చిందని ఆనంద మురిసిపోయారు.. ఇప్పుడు జగ్గన్నపేట గ్రామంతో పాటు ఎనిమిది గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సౌకర్యం సద్వినియోగం చేసుకుంటున్నారు. మా ఊరి బిడ్డ మంత్రి కావడం వల్లే ఊరికి బస్సు వచ్చిందని, మా కల నెరవేరిందని ఆనందంతో మురిసిపోతున్నారు. సీతక్క స్వగ్రామం జగ్గన్నపేట తో పాటు 8 గ్రామాల ప్రజలు సీతక్కకు కృతజ్ఞతలు చెప్పారు..
అయితే ఆర్టీసీ అధికారులు మాత్రం గతంలో ఈ మార్గంలో రోడ్డు సక్రమంగా లేక పోవడం వల్లే ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించలేక పోయామంటున్నారు. వారంతా ఎక్కువగా ప్రైవేటు వాహనాలు, ఆటో ద్వారా వెళుతుంటారు కాబట్టి ఆర్టీసీకి తగిన ఆదాయం లేకపోవడం వల్లే బస్సు సర్వీస్ నడపలేక పోయామని చెప్తున్నారు. కానీ, ఇప్పుడు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఖచ్చితంగా బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ సంకల్పం మేరకే బస్సు సేవలు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
