CM Revanth Reddy Oath Taking Highlights: ఆరు గ్యారెంటీలపైనే తొలి సంతకం.. సీఎం రేవంత్ రెడ్డికి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
Telangana CM Revanth Reddy Swearing-in Ceremony Highlights: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరే సమయం ఆసన్నమైంది. కొత్త ముఖ్యమంత్రిగా అనుమల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసేందుకు సర్వంసిద్ధమైంది. సరిగ్గా ఒంటి గంటా నాలుగు నిమిషాలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్ రెడ్డి. అందుకు, సర్వాంగ సుందరంగా సిద్ధమైంది ఎల్బీ స్టేడియం.
CM Revanth Reddy Swearing-in Ceremony: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం స్వీకారం చేయగా, ఆ తర్వాత మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఉమ ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం చేశారు.
రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు ఏఐసీసీ అగ్రనేతలంతా తరలివచ్చారు . ఉదయం శంషాబాద్ చేరుకున్న వీళ్లందరినీ, రేవంత్‌రెడ్డే స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి అహ్వానించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లిఖార్జున ఖర్గే, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏఐసీసీ నేతలకు స్వాగతం పలకారు.
రేవంత్ ఆత్మీయ ఆహ్వానం మేరకు గెలుపు కానుకను ఇచ్చిన తెలంగాణకు సోనియా వచ్చేశారు. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సహా కర్నాటక మంత్రులు, రేవంత్ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. అలాగే ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు… ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, టీడీపీ అధినేత చంద్రబాబులను ఆహ్వానించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు ప్రమాణస్వీకార ఆహ్వానాలు పంపించారు
రాజకీయ, సినీ రంగాలతో పాటు బహిరంగ లేఖతో సకల జనులకు సాదర స్వాగతం పలికారు రేవంత్ రెడ్డి. కలకానిది నిజమైనది. కాంగ్రెస్‌కు అపూర్వవైభవం ఇది. పదేళ్ల నిరీక్షణ తరువాత ప్రమాణోత్సవ పండుగతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ఆరు గ్యారెంటీలు సహా రజనీకి ఉద్యోగం. సీఎంగా రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. సోనియా, రాహుల్, ప్రియాంక సాక్షిగా ఇందిరమ్మ రాజ్య మహాసంరంభం…సామాజిక న్యాయం ప్రతిబింబించేలా సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ కొలువుదీరింది. ప్రమాణోత్సవ జాతర సందడి నెలకొంది.
LIVE NEWS & UPDATES
-
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయిః రేవంత్ రెడ్డి
సీఎం అయిన తరువాత తాము ఏం చేస్తామని చెప్పారో.. అదే చేశారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ ఇకపై ప్రజాభవన్‌గా మారబోతోందని.. అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని అన్నారు. ఆరు గ్యారంటీల విషయంలోనూ మాట నిలుపుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిందన్నారు. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయని పేర్కొన్న రేవంత్.. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుందన్నారు. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో, తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుందన్నారు. పేదల ముఖాల్లో వెలుగులు వెల్లివిరుస్తాయని, హక్కుల రెక్కలు విచ్చుకుంటాయన్నారు. త్వరలోనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
-
సా.5 గం.లకు తెలంగాణ కేబినెట్ భేటీ
సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో మొదటి కేబినెట్ భేటీ
హాజరు కానున్న కొత్త మంత్రులు
-
-
మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి
మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి
ఉత్తమ్ కుమార్ – హోంమంత్రి
భట్టి – రెవెన్యూ శాఖ
సీతక్క – గిరిజన శాఖ
తుమ్మల – రోడ్లు, భవనాలు
శ్రీధర్ బాబు – ఆర్థిక శాఖ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – మున్సిపల్ శాఖ
కొండా సురేఖ – స్త్రీ, శిశు, సంక్షేమం
దామోదర – ఆరోగ్య శాఖ
పొన్నం ప్రభాకర్ – బీసీ సంక్షేమ శాఖ
జూపల్లి – పౌర సరఫరాల శాఖ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – నీటి పారుదల శాఖ
-
సీఎం రేవంత్‌కు మేయర్ విజయలక్ష్మి శుభాకాంక్షలు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన మల్లు భట్టి విక్రమార్కకు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిశుభాకాంక్షలు తెలిపారు. సీఎం, మంత్రులకు ట్వీట్ వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Hearty Congratulations to Sri @revanth_anumula garu on being sworn in as the new Chief Minister of Telangana State. Hearty Congratulations to Dy. CM Sri @BhattiCLP garu & all the members of the new cabinet and the CLP !
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) December 7, 2023
-
రేవంత్‌కు నారా లోకేశ్ శుభాకాంక్షలు
సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
రేవంత్‌రెడ్డికి ట్విటర్ (ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
రేవంత్‌రెడ్డి విజయవంతంగా పాలన సాగించాలని ఆకాంక్షించిన లోకేశ్
Congratulations and best wishes to @revanth_anumula Garu on taking the oath as Telangana's Chief Minister. Wishing him a successful tenure. pic.twitter.com/shbs2umhTg
— Lokesh Nara (@naralokesh) December 7, 2023
-
-
ప్రగతి భవన్ ప్రజాభవన్‌గా మారడం ఒక విప్లవాత్మక చర్యః పొన్నం
కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆకర్షణీయ పథకాల కారణంగా తాము అధికారంలోకి రాలేదని, పదేళ్ల బీఆర్‌ఎస్ నిరంకుశ పాలనే దానికి కారణమని కొత్త మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రగతి భవన్ ప్రజాభవన్‌గా మారడం ఒక విప్లవాత్మక చర్య అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
-
రేవంత్ రెడ్డికి హరీశ్ రావు శుభాకాంక్షలు
సీఎం రేవంత్, మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి హరీష్‌రావు. హామీల అమలు దిశగా ప్రభుత్వం పనిచేయాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క గారికి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను.…
— Harish Rao Thanneeru (@BRSHarish) December 7, 2023
-
సీఎం రేవంత్‌రెడ్డికి మోదీ శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని ట్వీట్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు మోదీ.
Congratulations to Shri Revanth Reddy Garu on taking oath as the Chief Minister of Telangana. I assure all possible support to further the progress of the state and the welfare of its citizens. @revanth_anumula
— Narendra Modi (@narendramodi) December 7, 2023
-
ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి రేవంత్
ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి బయలుదేరారు రేవంత్ రెడ్డి.
-
పాలకులం కాదు.. సేవకులంః రేవంత్ రెడ్డి
తెలంగాణకు తాము పాలకులం కాదని.. సేవకులమని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని ఎంతో బాధ్యతగా నిర్వహిస్తామని అన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం సూచనలతో తెలంగాణను అభివృద్ధి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన కార్యకర్తలను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటానని అన్నారు.
-
ప్రగతి భవన్ ఇకపై జ్యోతిరావు పూలె ప్రజా భవన్‌గా మార్పు
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను బద్ధలుకొట్టామని అన్నారు. ప్రగతి భవన్ ఇకపై జ్యోతిరావు పూలె ప్రజా భవన్‌గా మారుస్తామని అన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణను ప్రపంచంతో పోటీపడే విధంగా తయారు చేస్తామని.. పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు.
-
తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మే పాలకులం కాదు.. ప్రజాసేవకులమని చెప్పారు. తెలంగాణకు పట్టిన చీడ పోయిందన్నారు. ముందుగదా ఆరు గ్యారంటీలపై సంతకం చేసిన రేవంత్.. రెండో సంతకం రజినికి ఉద్యోగం ఇస్తూ రెండో సంతకం చేశారు.
-
రజినికి జాబ్‌కార్డు అందజేసిన సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలైన ఆరు గ్యారంటీలపై సంతకం చేశారు. అలాగే వికలాంగురాలైన రజినికి జాబ్ కార్డును అందజేశారు.
-
Cabinet Minister Jupally Krishna Rao : మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణం స్వీకారం
మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు
దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన జూపల్లి కృష్ణారావు
-
Cabinet Minister Thummala Nageswara Rao : మంత్రిగా తుమ్మల ప్రమాణం స్వీకారం
మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు ప్రమాణం స్వీకారం
తుమ్మల చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ తమిళసై
దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తుమ్మల నాగేశ్వర రావు
-
Cabinet Minister Seethakka : మంత్రిగా సీతక్క ప్రమాణం స్వీకారం
మంత్రిగా అనసూయ @ సీతక్క ప్రమాణం స్వీకారం
సీతక్క ప్రమాణ స్వీకారం చేస్తున్నంత సేపు మార్మోగిన ఎల్బీ స్టేడియం
పవిత్ర హృదయంతో ప్రమాణం చేసిన సీతక్క
-
Cabinet Minister Konda Surekha : మంత్రిగా కొండా సురేఖ ప్రమాణం స్వీకారం
మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కొండా సురేఖ
ప్రజలకు న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా కొండా సురేఖ ప్రమాణం
-
Cabinet Minister Ponnam Prabhakar : మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రమాణం స్వీకారం
దైవ సాక్షిగా ప్రమాణం చేసిన పొన్నం ప్రభాకర్
-
Cabinet Minister Ponguleti Srinivas Reddy: మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం
మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం
పొంగులేటి చేత ప్రమాణం చేయించిన గవర్నర్
పవిత్ర హృదయంతో ప్రమాణం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
-
Cabinet Minister Sridharbabu: మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రమాణ స్వీకారం
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
-
Cabinet Minister Komatireddy Venkat Reddy: మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
-
Cabinet Minister Damodara Raja Narsimha: దామోదర రాజనర్సింహ ప్రమాణం
మంత్రిగా దామోదర రాజనర్సింహ ప్రమాణం స్వీకారం
అంగ్లంలో ప్రమాణ స్వీకారం చేసిన దామోదర రాజనర్సింహ
దామోదర రాజనర్సింహ చేత ప్రమాణం స్వీకారం చేయించిన గవర్నర్
-
Cabinet Minister Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణం
మంత్రులుగా ప్రమాణం చేసిన భట్టి, ఉత్తమ్
దైవసాక్షిగా ప్రమాణం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
Cabinet Minister Bhatti : మంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణం
మంత్రి గా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం
దైవ సాక్షిగా ప్రమాణం స్వీకారం చేసిన భట్టి విక్రమార్క
భట్టితో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై
-
Telangana CM Revanth Reddy: దైవ సాక్షిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
రేవంత్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
Congress leader Revanth Reddy takes oath as the Chief Minister of Telangana at Hyderabad’s LB stadium; Governor Tamilisai Soundararajan administers him the oath of office. pic.twitter.com/IKFg89N75a
— ANI (@ANI) December 7, 2023
-
ప్రమాణస్వీకార కార్యక్రమం షురూ
జాతీయ గీతాపనతో ప్రారంభమైన రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం
కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి
-
ఎల్బీ స్టేడియానికి గవర్నర్..
రాజ్‌భవన్ నుంచి బయల్దేరిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ఎల్బీ స్టేడియానికి చేరుకున్న గవర్నర్
గవర్నర్‌ను దగ్గరుండి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి
-
ట్రాఫిక్‌లో చిక్కుకున్న భట్టి, ఖర్గే
ఎల్బీ స్టేడియం బయట భారీగా ట్రాఫిక్ జామ్
ట్రాఫిక్‌లో చిక్కుకున్న మల్లిఖార్జున ఖర్గే, కేసి వేణుగోపాల్
ఖర్గేతో పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన మల్లు భట్టి విక్రమార్క
-
ఎల్బీ స్టేడియం చేరుకున్న రేవంత్ రెడ్డి
ఎల్బీ స్టేడియం చేరుకున్న రేవంత్ రెడ్డి
కాసేపట్లో సీఎంగా ప్రమాణం చేయనున్న రేవంత్‌రెడ్డి
ఎల్బీ స్టేడియం చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక
ఒకే కారులో సోనియా, రాహుల్, రేవంత్‌రెడ్డి
ప్రమాణస్వీకారానికి హాజరైన ఏఐసీసీ అగ్రనేతలు
-
ఎల్బీ స్టేడియానికి బయల్దేరిన రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎల్బీ స్టేడియానికి బయల్దేరిన రేవంత్ రెడ్డి
సోనియా, రాహుల్, ప్రియాంకతో కలిసి బయల్దేరిన రేవంత్
తాజ్ కృష్ణ హోటల్ నుంచి ఎల్బీ స్టేడియంకు బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు
స్టేడియం కు బయలుదేరిన సోనియా, రాహుల్, ప్రియాంక
రేవంత్ రెడ్డితో పాటు బయలుదేరిన మల్లిఖార్జున ఖర్గే, హిమాచల్ ప్రదేశ్ సీఎం
-
అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్
1964లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జననం
1984లో ఇంటర్మీడియట్ పూర్తి
2008 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్ నియోజకవర్గ నుంచి విజయం
2009లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం
2012లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములు
2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియామకం
2023లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి MLAగా గెలిచిన ప్రసాద్‌కుమార్
అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ఖరారు చేసిన ఏఐసీసీ
-
తాజ్‌కృష్ణ వద్ద నేతల క్యూ
ఎల్‌బీ స్టేడియంలో కళాకారులు, కాంగ్రెస్ కార్యకర్తల సందడి కనిపిస్తే- అంతకు మించిన సందడి వాతావరణం హోటల్ తాజ్‌కృష్ణలో కనిపించింది. కాంగ్రెస్ అగ్రనేతల సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ బస చేసిన హోటల్ దగ్గరకు కాంగ్రెస్ నేతలంతా క్యూ కట్టారు. అగ్రనేతలను కలిసేందుకు పోటీపడ్డారు. ఏపీకి చెందిన నాయకులు కూడా హోటల్ తాజ్‌కృష్ణకు వచ్చారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు కూడా సోనియా గాంధీ, రాహుల్‌ను కలిసేందుకు వచ్చారు.
-
ఎల్బీ స్టేడియం చేరుకున్న ఎమ్మెల్యేలు
కాసేపట్లో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
మ.12:45 గంటలకు ఎల్బీ స్టేడియానికి రేవంత్
ఎల్బీ స్టేడియం చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
రెండు ప్రత్యేక బస్సుల్లో చేరుకున్న ఎమ్మెల్యేలు
-
తుమ్మల నాగేశ్వరరావు
15 నవంబర్ 1953 ఖమ్మం జిల్లా గండుగులపల్లిలో జననం
1982లో తెలుగుదేశం పార్టీతో రాజకీయ ఆరంగ్రేటం
1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన తుమ్మల
1985, 1994, 1999, 2009, 2016 ఎన్నికల్లో గెలుపు
ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు
2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల
2023 ఖమ్మం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం
-
తాజ్‌కృష్ణకు చేరుకున్న పొంగులేటి, అజహరుద్దీన్
హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్ వద్ద కాంగ్రెస్ నేతల హడావిడి
తాజ్‌కృష్ణకు చేరుకున్న కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజహరుద్దీన్
సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలను కలువనున్న పొంగులేటి, అజహరుద్దీన్
-
కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం షెడ్యూల్ ఇదే!
12:45 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్న రేవంత్ రెడ్డి.
12:55 గంటలకు ఎల్బీస్టేడియం చేరుకోనున్న గవర్నర్ తమిళ సై సౌందరరాజన్..
1:04 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.
1:25 గంటలకు డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం.
చివరగా గవర్నర్, సీఎంతో మంత్రి మండలి గ్రూప్ ఫోటో.
-
టీవీ9తో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
సీఎం పదవి ఆశించిన మాట వాస్తవమేనన్న భట్టి విక్రమార్క
పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తాం-భట్టి
అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్
పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు ప్రతి పార్టీలో ఉండేవే. రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు సర్దుకుంటాయి – భట్టి
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తాం- భట్టి
పార్టీలో అందరికీ పదవులు దక్కడం అసాధ్యం, అన్ని సమస్యలు త్వరలో సర్దుకుంటాయి – మల్లు భట్టి విక్రమార్క
-
రాజ్‌భవన్‌కు చేరిన మంత్రుల జాబితా
రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి సర్వంసిద్ధం
తెలంగాణ సీఎంగా మరో గంటలో అనుమల రేవంత్ రెడ్డి ప్రమాణం
మంత్రులుగా 11మందికి అవకాశం
డిప్యూటీ సీఎంగా మల్లు భట్టివిక్రమార్క
మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు
దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ
కొత్త మంత్రులకు స్వయంగా ఫోన్‌చేసి చెప్పిన మానిక్ టాకూర్
ఇప్పటికే రాజ్‌భవన్‌కు చేరిన మంత్రుల జాబితా
స్పీకర్ ఎన్నిక తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ
-
ఎల్బీ స్టేడియానికి బయల్దేరిన ఎమ్మెల్యేలు
ఎల్బీ స్టేడియానికి బయల్దేరిన కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యేలు
గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ నుంచి బయల్దేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి బస్సుల్లో బయల్దేరిన ఎమ్మెల్యేలు
-
ఖర్గేకు ఘన స్వాగతం
శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మల్లికార్జున ఖర్గే
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, హిమాచల్ సీఎం సుఖ్విందర్
ఘన స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి
-
ఎయిర్‌పోర్టులోనే ఉన్న రేవంత్‌రెడ్డి
ఇంకా ఎయిర్‌పోర్టులోనే ఉన్న రేవంత్‌రెడ్డి
ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే రాక కోసం ఎదురు చూస్తున్న రేవంత్
ఎయిర్‌పోర్ట్ నుంచే కాబోయే మంత్రులకు మానిక్ టాకూర్, రేవంత్ రెడ్డి ఫోన్లు
కాసేపట్లో శంషాబాద్ చేరుకోనున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
రేవంత్ రెడ్డి ప్రమాణానికి వస్తున్న కర్నాటక సీఎం సిద్దరామయ్య
ఎయిర్‌పోర్ట్‌కి చేరుకునన హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్
-
ప్రగతి భవన్ ఎదుట బారికేడ్ల తొలగింపు
ప్రగతి భవన్ ఎదుట బారికేడ్లను తొలగించాలని ఆదేశించడంతో ట్రాఫిక్ పోలీసులు వాటిని తొలగించి వాహనాలకు అనుమతిస్తున్నారు. మరో ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా తొలగిస్తామని పోలీసులు తెలిపారు.
-
జిల్లాల వారీగా మంత్రులు..
కొత్త మంత్రివర్గంలో రేవంత్ రెడ్డితో సహా 11మంది మంత్రులకు అవకాశం దక్కింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు, ఖమ్మం నుంచి ముగ్గురు, ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు, నల్లగొంగ నుంచి ఇద్దరు, మహబూబ్‌నగర్ నుంచి ఒకరు, మెదక్ నుంచి ఒకరికి కేబినెట్‌లో స్థానం లభించింది.
-
కాసేపట్లో ఎల్బీ స్టేడియానికి సోనియా గాంధీ
తాజ్‌కృష్ణకు చేరుకున్న సోనియా గాంధీ
సోనియా, రాహుల్‌ను కలిసేందుకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నేతలు
తాజ్‌కృష్ణ నుండి కాసేపట్లో ఎల్బీ స్టేడియంకు సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ గాంధీ
-
దుద్దిళ్ల శ్రీధర్ బాబు
జననం 9 మార్చి 1969
ధన్వాడ గ్రామం, కాటారం మండలం, జయశంకర్ జిల్లా, తెలంగాణ
తల్లిదండ్రులు దుద్దిల్ల శ్రీపాద రావు, జయమ్మ
జీవిత భాగస్వామి శైలజ రామయ్యర్ (ఐఏఎస్ అధికారిణి)
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించారు.
1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్.
1999లో తండ్రి హత్యానంతరం రాజకీయాల్లో అడుగుపెట్టిన శ్రీధర్‌బాబు
1999 శాసనసభ ఎన్నికల్లో మంథని నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం
1999 కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు
1999 – 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం శాసనసభ్యునిగా ఎన్నిక
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు.
-
జూపల్లి కృష్ణారావు
1955, ఆగస్టు 10న జననం
1999 – 2014 మధ్య కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వరుస విజయాలు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా అవకాశం
2011లో కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్‌ఎస్‌లో చేరిక
2014లో తెలంగాణ తొలి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఓటమి
2022లో బీఆర్ఎస్ పార్టీ వీడి మళ్లీ కాంగ్రెస్‌లో చేరిక
2023లో కొల్లాపూర్ నుంచి మరోసారి అసెంబ్లీకి ఎన్నిక
-
కొండా సురేఖ
1965 ఆగస్టు 19న జననం
1995లో మండల పరిషత్‌గా ఎన్నిక
1999, 2004 ఎన్నికల్లో శాయంపేట ఎమ్మెల్యే ఎన్నిక
2009లో పరకాల నియోజకవర్గం నుంచి గెలుపు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి
2011లో కాంగ్రెస్‌కు రాజీనామా
2014లో బీఆర్ఎస్ పార్టీ తరుఫున వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపు
2018లో మరోసారి కాంగ్రెస్‌లో చేరిక
2023లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం
-
పొన్నం ప్రభాకర్ గౌడ్
1967 మే 8న జననం
విద్యార్థి నాయకుడిగా రాజకీయం అరంగ్రేటం
1987 – 89 వరకు NSUI కరీంనగర్ జిల్లా కార్యదర్శి
1989 – 91 వరకు NSUI ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి
1999- 2002 వరకు NSUI ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు
2002 – 2003 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
2009లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపు
2014లో కరీంనగర్ ఎంపీ స్థానంలో ఓటమి
2018 అసెంబ్లీఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఓటమి
2023లో హుస్నాబాద్ నుంచి అసెంబ్లీకి ఎన్నిక
-
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
2014లో ఖమ్మం నుంచి YSRCP తరపున ఎంపీగా విజయం
2014 తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిక
2023లో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్
2023లో పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక
-
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
1963 మే 23న జననం
యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ అరంగేట్రం
2009 – 2014 మధ్య నల్గొండ ఎమ్మెల్యేగా బాధ్యతలు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో చోటు
2011లో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా
2018లో నల్గొండ అసెంబ్లీ స్థానంలో ఓటమి
2019లో భువనగిరి పార్లమెంటు సభ్యులుగా గెలుపు
2023లో మరోసారి నల్గొండ నుంచి అసెంబ్లీకి ఎన్నిక
-
ధనసరి అనసూయ ( సీతక్క )
1971 జూలై 9న జననం
1988లో 10వ తరగతిలోనే నక్సల్స్ పార్టీలో చేరిక
జన నాట్యమండలి ద్వారా ఆదివాసీల సమస్యలపై పోరాటం
రెండు దశాబ్దాల పాటు కామ్రేడ్‌గా వివిధ హోదాల్లో విధులు
ఎన్టీఆర్ పిలుపుతో జనజీవన స్రవంతిలోకి రాక
2001లో న్యాయవాదిగా ప్రాక్టీస్
2004లో ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ, తప్పని ఓటమి
2009లో తొలిసారి ములుగు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక
2014లో ఓటమి, అనంతరం కాంగ్రెస్‌లో చేరిక
2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ములుగు నుంచి గెలుపు.
2023 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి విజయం
-
ఉత్తమ్ కుమార్ రెడ్డి
1962 జూన్ 20న జననం
బీఎస్సీ గ్రాడ్యుయేట్, ఇండియన్ ఫోర్స్ మాజీ పైలట్
1999-2009 మధ్య కోదాడ ఎమ్మెల్యే
2014దాకా ఉమ్మడి ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి
2015-2021 మధ్య తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు
2009-2018 మధ్య హుజుర్‌నగర్ ఎమ్మెల్యే
2019 సాధారణ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా గెలుపు
2023లో మరోసారి హుజుర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
-
భట్టి విక్రమార్క
1961, జూన్ 15న మల్లు భట్టి విక్రమార్క జననం.
విద్యాభ్యాసంః హైదరాబాద్ నిజాం కాలేజ్‌లో డిగ్రీ, HCUలో పీజీ.
2009లో తొలిసారి మధిర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక
2009-11 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ విప్‌గా బాధ్యతలు
2011-2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్
2009 – 2023 మధ్య 4సార్లు మధిరలో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం
గత శాసనసభలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా బాధ్యతలు
-
ప్రమాణ స్వీకారం చేయబోయే కొత్త మంత్రులు వీరే..!
ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత 11మంది మంత్రులకు అవకాశం దక్కింది. మంత్రులుగా ప్రమాణం చేయనున్న వారిలో మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, సుదర్శన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. మంత్రివర్గ జాబితాలో ఉన్న వారికి రేవంతే స్వయంగా ఫోన్ చేస్తున్నారు.
-
సీఎం హోదాలో తొలి సంతకం ఆరు గ్యారెంటీల అమలుపైనే..
తెలంగాణ ముఖ్యమంత్రిగా నేడే రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
గులాబీ జెండాతో ఎంట్రీ ఇచ్చి అదే పార్టీని గద్దె దించిన హీరో
దూకుడుకు బ్రాండ్ ఎంబాసిడర్, ధైర్యానికి కేరాఫ్ అడ్రస్
జడ్పీటీసీ నుంచి సీఎం దాకా అలుపెరగని పోరాటం
ఆటుపోట్లకు అదరలేదు.. వైఫల్యాలకు కుంగలేదు..
మహోన్నత ఘట్టానికి అంగరంగ వైభవంగా సర్వం సిద్ధం
అతిరథమహారథులు సహా తెలంగాణ ప్రజలందరికీ ఆహ్వానం
-
పెద్దమ్మ తల్లి ఆలయానికి రేవంత్ రెడ్డి.
మరికాసేపట్లో పెద్దమ్మ తల్లి ఆలయానికి రేవంత్ రెడ్డి.
కుటుంబ సమేతంగా పెద్దమ్మతల్లిని దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి
పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న రేవంత్, కుటుంబ సభ్యులు..
-
హైదరాబాద్ చేరుకున్న సోనియా గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వీరికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. మధ్యాహ్నం జరగనున్న సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక హాజరవుతారు. కాసేపట్లో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకోనున్నారు.
-
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రేవంత్‌రెడ్డి
మాణిక్ టాకూర్‌తో కలిసి సోనియా గాంధీకి స్వాగతం పలకనున్న రేవంత్‌రెడ్డి
ఎయిర్‌పోర్ట్ నుండి తాజ్‌హోటల్‌కు వెళ్లనున్న..సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక
ఈ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న సోనియా గాంధీ కుటుంబం
-
ఎల్బీ స్టేడియం వద్ద మూడంచెల భద్రత
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీలు, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సభకు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు.. అందుకు తగ్గట్టుగానే భద్రతా ఏర్పాట్లు చేశారు.
-
మంత్రుల విషయంపై తీవ్ర గోప్యత
తెలంగాణ మంత్రివర్గంపై కొనసాగుతున్న ఉత్కంఠ.
మంత్రుల ప్రమాణంపై ఇంకా రాని స్పష్టత.
ఆహ్వానపత్రంలో సీఎం, మంత్రుల ప్రమాణం అంటూ సమాచారం.
ఎమ్మెల్యేలకు మాత్రం ఇంకా అందని సమాచారం.
రేవంత్‌తోపాటు ఐదుగురు మంత్రులు ప్రమాణం చేస్తారని టాక్.
కేబినెట్‌లో స్థానం కోసం ఆశావహుల ఎదురుచూపులు.
భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కకు ఛాన్స్ అంటూ ప్రచారం.
స్పీకర్ ఎన్నిక తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ?
-
భారీగా తరలివస్తున్న కార్యకర్తలు, అభిమానులు
అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు.
తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ.
ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు.
ఎల్బీ స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు.
ఉదయం నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్‌కు భారీగా చేరుకుంటున్న కాంగ్రెైస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు.
హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.
-
ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ఆంక్షలు
భారీ కాన్వాయ్‌తో ఎల్బీ స్టేడియానికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి.
రేవంత్‌రెడ్డి కోసం ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేసిన పోలీసులు.
రేవంత్ రెడ్డి ప్రయాణించే మార్గంలో రూట్ క్లియరెన్స్‌కు ఏర్పాట్లు.
జూబ్లీహిల్స్ నుంచి ఎల్బీ స్టేడియం వరకు భారీ బందోబస్తు.
ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 5గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.
పబ్లిక్ గార్డెన్ – బషీర్‌బాగ్ రోడ్డును మూసివేసిన పోలీసులు.
-
ఎల్లా హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం
హోటల్ ఎల్లా నుంచి ఎల్బీ స్టేడియంకు బస్సుల్లో వెళ్లనున్న ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక బస్సులను సిద్ధం చేసిన అధికారులు.
ఎల్లా హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేసిన తెలంగాణ పోలీసులు.
అనుమతి లేనిదే హోటల్ లోపలికి ఎవరినీ రానివ్వని పోలీసులు.
-
ఏఐసీసీ అగ్రనేతలకు పటిష్ట బందోబస్తు
సోనియా రాహుల్, ప్రియాంక గాంధీలకు రాక సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన రాష్ట్ర పోలీసులు.
ముగ్గురికి వేరు వేరుగా జామర్లతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ ఏర్పాటు చేసిన పోలీసులు.
ఇది వరకు రాష్ట్రానికి వచ్చినప్పుడు కేవలం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మాత్రమే ఏర్పాటు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పటిష్ట భద్రత పెంచిన తెలంగాణ పోలీసులు.
-
రేవంత్ నివాసానికి మాణిక్ రావు టాకూర్.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు స్వాగతం పలికేందుకు కదులుతున్న పార్టీ నాయకులు
సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఘన స్వాగతం పలుకేందుకు సిద్ధమైన తెలంగాణ నేతలు.
తాజ్ కృష్ణ హోటల్ నుంచి రేవంత్ రెడ్డి నివాసానికి బయలుదేరిన మాణిక్ రావు టాకూర్.
రేవంత్ రెడ్డితో కలిసి ఎయిర్‌పోర్టుకు వెళ్లి సోనియాకు స్వాగతం పలకనున్న టాకూర్.
-
ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా తాజ్ హోటల్‌కు..
ఉదయం 9:30 కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ.
ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా తాజ్ హోటల్‌కు వెళ్ళనున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.
మధ్యాహ్నం గం.12:30 లకు ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ.
-
స్వయంగా అగ్రనేతలను రిసీవ్ చేసుకోనున్న రేవంత్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద భారీగా మొహరించిన పోలిసులు.
మరికాసేపేట్లో ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ
అగ్ర నేతలను రిసీవ్ చేసుకునేందుకు 9:30కు ఎయిర్‌పోర్ట్‌కు రానున్న కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి హార్డింగ్స్, ఫ్లెక్సీ లతో నిండిపోయిన ఎయిర్‌పోర్ట్ పరిసరాలు
ఎయిర్‌పోర్ట్ నుండి ఎల్ బీ స్టేడియం వరకు భారీగా పోలిసుల మొహరింపు
-
భాగ్యనగరంలో ఎటూ చూసిన 3 రంగుల జెండాలు
హైదరాబాద్ అంతటా కాంగ్రెస్ ఫ్లెక్సీలు, జెండాలు.
రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ పెద్దఎత్తున బ్యానర్లు.
రేవంత్ నివాసం దగ్గర భారీగా ఫ్లెక్సీలు కట్టిన అభిమానులు.
గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కాంగ్రెస్‌మయం.
ఏఐసీసీ అగ్రనేతలకు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు.
ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి సోనియా, రాహుల్‌కి స్వాగతం పలకనున్న రేవంత్.
-
గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్‌తో స్వాగతం
స్టేడియం బయటా భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో అతిథులకు స్వాగతం పలకనున్నారు. అలాగే, 500మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్టేడియం లోపలే కాదు… స్టేడియం బయటా కార్యక్రమాన్ని వీక్షించేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు
-
అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేక గ్యాలరీ
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమంలో అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ప్రత్యేక స్థానం కల్పించారు. వాళ్ల కోసం రెండు స్పెషల్ గ్యాలరీలు రెడీ చేశారు. 300 సీట్లతో అమరవీరుల కుటుంబాలకు ఒక గ్యాలరీ… తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు.
-
ఎమ్మెల్యేలు, వీవీఐపీలకు ప్రత్యేక వేదికలు
ప్రధాన వేదికకు ఎడమ వైపున, కుడి వైపున రెండు వేదికలను రెడీ చేశారు. లెఫ్ట్ సైడ్ వేదికపై 63మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. రైట్ సైడ్ వేదికపై 150మంది వీవీఐపీలు కూర్చుకునేందుకు రెడీ చేశారు.
-
ప్రమాణస్వీకారోత్సవవానికి 3 వేదికలు సిద్ధం
రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంలో మూడు వేదికలు సిద్ధమయ్యాయి. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌లు ఆశీసులు కానున్నారు. ఈ వేదికపై నుంచే రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
-
సర్వాంగ సుందరంగా ఎల్బీ స్టేడియం.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరే సమయం ఆసన్నమైంది. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసేందుకు సర్వంసిద్ధమైంది. సరిగ్గా ఒంటి గంటా నాలుగు నిమిషాలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్. అందుకు, సర్వాంగ సుందరంగా సిద్ధమైంది ఎల్బీ స్టేడియం.
-
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం
తెలంగాణ ముఖ్యమంత్రిగా నేడు రేవంత్‌రెడ్డి ప్రమాణం.
మధ్యాహ్నం 1:04కి ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి.
రేవంత్ ప్రమాణానికి తరలిరానున్న ఏఐసీసీ అగ్రనేతలు.
హాజరుకానున్న సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ.
ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, నితీశ్ కుమార్, సిద్ధరామయ్యకు ఆహ్వానాలు
వివిధ రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు కూడా ఆహ్వానం.
అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు స్పెషల్ ఇన్విటేషన్.
Published On - Dec 07,2023 8:18 AM