AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఖాకీ డ్రెస్ వదిలి ఖద్దర్.. అసెంబ్లీలో ప్రస్తుతం ఆయనే సంథింగ్ స్పెషల్..!

ఖాకీ డ్రెస్ వదిలి ఖద్దర్ ధరించిన నేతలు రాజకీయాల్లో రాణించడం చాలా ఆరదు.. ఒకవేళ ప్రజల ఆశీర్వాదంతో చట్టసభల్లో అడుగుపెట్టినా నిలదొక్కుకోవడం గగనమే..! కానీ ఐపీఎస్ పదవీ విరమణ పొందిన వెంటనే MLA గా గెలిచిన ఆ నాయకుడు మాత్రం వినూత్న కార్యక్రమాలతో జనంలో దూసుకుపోతున్నారు

Telangana: ఖాకీ డ్రెస్ వదిలి ఖద్దర్.. అసెంబ్లీలో ప్రస్తుతం ఆయనే సంథింగ్ స్పెషల్..!
Kr Nagaraju
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 24, 2024 | 4:36 PM

Share

ఖాకీ డ్రెస్ వదిలి ఖద్దర్ ధరించిన నేతలు రాజకీయాల్లో రాణించడం చాలా ఆరదు.. ఒకవేళ ప్రజల ఆశీర్వాదంతో చట్టసభల్లో అడుగుపెట్టినా నిలదొక్కుకోవడం గగనమే..! కానీ ఐపీఎస్ పదవీ విరమణ పొందిన వెంటనే MLA గా గెలిచిన ఆ నాయకుడు మాత్రం వినూత్న కార్యక్రమాలతో జనంలో దూసుకుపోతున్నారు. తన మార్కు పాలనతో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తను మాత్రమే కాదు తన తనయుడిని కూడా అదే బాటలోనే నడిచేలా చేస్తూ, యువ నాయకుడిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాడట.

పోలీస్ మైండ్ సెట్.. పొలిటిషన్ మైండ్ సెట్.. ఒకేలా ఉండదు అనేది నానుడి. అందుకే రాజకీయాల్లో అడుగుపెట్టిన చాలామంది పోలీస్ అధికారులు సుదీర్ఘ రాజకీయాల్లో రాణించిన చరిత్ర లేదు. కొందరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైతే మరికొందరు గెలిచినా రాజకీయాల్లో నిలదొక్కుకోలేక పోతున్నారు. కానీ ఐపీఎస్ పదవి విరమణ పొందిన వెంటనే ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకుని గెలుపొందారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి KR నాగరాజు. ఆయన మాత్రం వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం ఆయనే సంథింగ్ స్పెషల్.. పోలీస్ అధికారిగా ఒకప్పుడు ప్రజాప్రతినిధులకు సెల్యూట్ చేసిన ఆయన ఇప్పుడు అదే ప్రజాప్రతినిదులతో సమానంగా అసెంబ్లీలో కూర్చొని తన నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు..

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం నుండి గెలుపొందిన రిటైర్డ్ IPS అధికారి KR నాగరాజు వినూత్న కార్యక్రమాలతో ప్రజల మనసు గెలిచే ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం తన ఇంటికి, క్యాంపు కార్యాలయానికి జనం బారులు తీరడం చూసి ఓ కొత్త కాన్సెప్ట్ ప్రవేశ పెట్టారు. డయల్ యువర్ ఎంఎల్ఏ అనే కాన్సెప్ట్ తో ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా ప్లాన్ చేశారు. నియోజకవర్గ ప్రజలు ప్రతీ పనికి MLA ఇంటికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ సమస్య ఉన్నా 8096107107 నెంబర్ కు ఫోన్ చేసి విషయం చెబితే సరిపోతుంది.. వారం రోజుల వ్యవధిలో ఆ సమస్యకు పరిష్కారం అవుతుందా..? లేదా అవాంతరాలు ఏమున్నాయి..? అనేది ఎంఎల్ఏ నియమించిన ప్రత్యేక సిబ్బంది తెలియపరుస్తారు.

ముఖ్యంగా పచ్చదనం, స్వచ్చధనం కార్యక్రమంలో కూడా ప్రత్యేకత చాటుకున్న ఈ MLA వరంగల్ మహా నగరం చుట్టూ విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఓ మోడల్ గా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ఫ్యూచర్ ప్లాన్ తో తన తనయుడిని కూడా రాజకీయ రంగంలోకే దింపారు.. ఆయన తనయుడు దిలీప్ ప్రస్తుతం హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడు. తన తనయున్ని కూడా చట్టసభల్లోకి పంపడానికి ఇప్పటి నుండే లైన్ క్లియర్ చేస్తున్నారట.

మొత్తం మీద పోలీస్ ఉద్యోగానికి స్వస్తిచెప్పి రాజకీయాల్లో అడుగుపెట్టిన వారు రాణించరు అనే ప్రచారానికి చెక్ పెట్టి కొత్త చరిత్ర సృష్టించాలని ఈయన ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు జనంలో చర్చగా నిలుస్తున్నాయి. ఈ నియోజకవర్గ ప్రజల చేత కూడా మా ఎంఎల్ఏ భేష్ అనిపించుకుంటున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…