మండపాల వద్ద మాయమవుతున్న వినాయకుడికి పెట్టిన లడ్డూ ప్రసాదాలు.. తీరా చూసి షాక్..!
ఊరు వాడలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.. బొజ్జ గణపతికి ప్రీతికరమైన లడ్డూలు, రకరకాల ఫలహారాలు నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహిస్తున్నారు.. వరంగల్ లోని ఓ కాలనీలో భక్తులు సమర్పించే ఫలహారాలు, లడ్డూలను చిట్టెలుకలు అట్టే మింగేస్తున్నాయి. లడ్డూలను భోంచేసి భక్తులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

మూషికాలు వినాయకుడి ప్రసాదాలు మింగేస్తున్న ఈ విచిత్ర సంఘటన వరంగల్ లోని కొత్తవాడ మార్కండేయ కాలనీలో జరిగింది. సూర్యోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిత్య పూజలలో భాగంగా గణపతికి లడ్డూలు ప్రసాదంగా సమర్పిస్తున్నారు. అయితే, ఓ మూషికం రోజు వచ్చి గణపతి లడ్డూలను భోంచేసి భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. రెండు రోజులు వరుసగా మండపం వద్దకు వచ్చిన మూషికం భక్తులు సమర్పించే లడ్డూ తింటూ అటు ఇటు తిరుగుతూ సందడి చేస్తున్నాయి
మూషికం వచ్చి లడ్డూలు తినడం చూసి అక్కడ భక్తులు ఆనందంతో మురిసిపోతున్నారు. భక్తుల అలజడి ఉన్నా.. పట్టించుకోకుండా యథేచ్ఛగా అరగించి వెళ్తున్నాయి. గణపతి మండపంలోకి వచ్చి అక్కడి భక్తులు సమర్పించే ప్రసాదాలు స్వయంగా స్వీకరించి వెళుతున్నాడని భక్తులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. మూషికాలు లడ్డూలు తింటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..