Viral: చెరువులో చేపలు పట్టేందుకు వల విసరిన జాలర్లు.. కట్ చేస్తే, బంగారు వర్ణంతో కళ్లు జిగేల్..
చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులంతా సిద్ధమయ్యారు.. ఎప్పటిలానే వారంతా చెరువులోకి దిగి వల విసిరారు. ఈ క్రమంలో ఓ చేపను వారంతా ఆశ్చర్యపోయారు. మత్స్యకారులకు బంగారు వర్ణంలో ఉన్న చేప దొరికిన ఘటన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులంతా సిద్ధమయ్యారు.. ఎప్పటిలానే వారంతా చెరువులోకి దిగి వల విసిరారు. ఈ క్రమంలో ఓ చేపను వారంతా ఆశ్చర్యపోయారు. మత్స్యకారులకు బంగారు వర్ణంలో ఉన్న చేప దొరికిన ఘటన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కంగ్టి మండల పరిధిలోని తడకల్ గ్రామంలోని పెద్ద చెరువులో సోమవారం బంగారు వర్ణం చేప లభ్యమైనట్లు మత్స్యకారులు తెలిపారు. మత్స్యకారులు తెలిపిన ప్రకారం.. తడకల్ గ్రామంలోని పెద్ద చెరువులో వారం రోజుల నుంచి చేపల వేట కొనసాగిస్తున్నారు. ప్రతిరోజూ మాదిరిగానే మత్స్యకారులు సోమవారం ఉదయం వల వేయగా.. బంగారం వర్ణం చేప చిక్కింది. ఇది చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఒడ్డుకు తీసుకురాగా.. అందరూ దాన్ని చూస్తూ సంబరపడ్డారు.
చేప బరువు సుమారు ఐదు కిలోలపైనే ఉందని తడకల్ మత్స్యకారులు వెల్లడించారు. ఇలాంటి చేప దొరకడం ఇదే మొదటిసారని వివరించారు. కాగా.. బంగారు వర్ణంతో ఉన్న చేప దొరికిందన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు, చుట్టుపక్కల వారు చేపను చూసేందుకు భారీగా తరలివచ్చారు.
తడకల్ చెరువులో దొరికిన చేప..
అయితే, ఆ చేపను హైదరాబాద్ లోని ముషిరాబాద్ మార్కెట్ కు తరలించినట్లు మత్స్యకారులు తెలిపారు. అంతకుముందు ఇలాంటి చేపలు లభ్యమైన విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..