Telangana Elections: సింహాలు గుంపులుగా కూడా వస్తాయన్న రాహుల్.. జగిత్యాల సభలో రాహుల్ ఆవేశపూరిత ప్రసంగం

తెలంగాణలోని బీఆర్‌ఎస్‌, ఢిల్లీలో బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కేంద్రం పెట్టిన అన్ని బిల్లులకూ బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతిచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ని తెర్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే..బలహీనవర్గాల కులగణన చేపడతామని స్పష్టం చేశారు. కులగణన అనేది దేశానికి ఎక్స్‌రే లాంటిదన్నారు రాహుల్‌ గాంధీ.తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ఈ క్యాస్ట్ సెన్సస్‌తోనే పూడుస్తామని జగిత్యాల సభలో ప్రామిస్ చేశారు రాహుల్ గాంధీ .

Telangana Elections: సింహాలు గుంపులుగా కూడా వస్తాయన్న రాహుల్.. జగిత్యాల సభలో రాహుల్ ఆవేశపూరిత ప్రసంగం
Rahul At Jagtial
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 20, 2023 | 2:13 PM

బీజేపీ, బీఆర్ఎస్‌లపై ఫైరయ్యారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రజా తెలంగాణ కోరుకుంటే..దొరల తెలంగాణ వచ్చిందని విమర్శించారు. ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో మీకోసం పోరాడడానికి తాను సైనికుడిగా ఉంటానని రాహుల్ గాంధీ అన్నారు. జగిత్యాల కార్నర్ మీటింగ్‌లో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని.. తాను ఉంటున్న ఇల్లు తీసుకున్నారని మండిపడ్డారు. మీ ఇల్లు అవసరం లేదు తీసుకోండి.. దేశమంతా తన ఇల్లే అని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ని తెర్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే..బలహీనవర్గాల కులగణన చేపడతామని స్పష్టం చేశారు. కులగణన అనేది దేశానికి ఎక్స్‌రే లాంటిదన్నారు రాహుల్‌ గాంధీ.తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ఈ క్యాస్ట్ సెన్సస్‌తోనే పూడుస్తామని జగిత్యాల సభలో ప్రామిస్ చేశారు రాహుల్ గాంధీ .

సింహాలు సింగిల్‌గానే కాదు.. గుంపులుగా..

సింహాలు సింగిల్‌గానే కాదు.. గుంపులుగా కూడా వస్తాయ్ అంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తెలంగాణాలో కాంగ్రెస్ సింహాలు గర్జిస్తున్నాయ్.. రాబోయేది బబ్బర్ షేర్ తెలంగాణా అన్నారు. ప్రజల తెలంగాణా కోసమే కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణాలో తమ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే, నాలుగు నెలల్లోనే ఓబీసీ కులగణన చేపట్టి.. వాళ్లకు రావల్సిన వాటా వాళ్లకు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ఈ క్యాస్ట్ సెన్సస్‌తోనే పూడుస్తామని జగిత్యాల సభలో ప్రామిస్ చేశారు రాహుల్.

జగిత్యాలలో యాత్రలో..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విజయభేరీ బస్సు యాత్ర మూడో రోజు మరింత జోష్‌తో సాగింది. జగిత్యాలలో యాత్రలో పాల్గొన్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. ఈసారి దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలని పునరుద్ఘాటించారు. తెలంగాణకు కేసీఆర్‌ నియంతలా, రాజులా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామన్నారు. ఈ క్రమంలోనే ప్రజలతో తమ పార్టీకి ఉన్న ప్రేమానుబంధాలు దశాబ్దాల నాటివని ఆయన పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ల కాలం నుంచి ప్రజలతో తమకు మంచి అనుబంధం ఉందని రాహుల్‌ తెలిపారు.

ఇక్కడితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ విజయభేరీ బస్సు యాత్ర ముగిసింది. కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లో ప్రజలకు అభివాదం చేస్తూ సాగింది. నిజామాబాద్ జిల్లాలో రాహుల్ విజయభేరీ యాత్ర ప్రవేశించింది. రాహుల్ యాత్రకు ప్రజలు సాదరంగా ఆహ్వానించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!