ఈ ఎలక్షన్‌ దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్యే.. రాహుల్ కీలక కామెంట్స్

ఈ ఎలక్షన్‌ దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్యే.. రాహుల్ కీలక కామెంట్స్

Ravi Kiran

|

Updated on: Oct 20, 2023 | 1:58 PM

సింహాలు సింగిల్‌గానే కాదు.. గుంపులుగా కూడా వస్తాయ్ అంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తెలంగాణాలో కాంగ్రెస్ సింహాలు గర్జిస్తున్నాయ్.. రాబోయేది బబ్బర్ షేర్ తెలంగాణా అన్నారు. ప్రజల తెలంగాణా కోసమే కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణాలో తమ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే, నాలుగు నెలల్లోనే ఓబీసీ కులగణన చేపట్టి.. వాళ్లకు రావల్సిన వాటా వాళ్లకు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సింహాలు సింగిల్‌గానే కాదు.. గుంపులుగా కూడా వస్తాయ్ అంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తెలంగాణాలో కాంగ్రెస్ సింహాలు గర్జిస్తున్నాయ్.. రాబోయేది బబ్బర్ షేర్ తెలంగాణా అన్నారు. ప్రజల తెలంగాణా కోసమే కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణాలో తమ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే, నాలుగు నెలల్లోనే ఓబీసీ కులగణన చేపట్టి.. వాళ్లకు రావల్సిన వాటా వాళ్లకు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ఈ క్యాస్ట్ సెన్సస్‌తోనే పూడుస్తామని జగిత్యాల సభలో ప్రామిస్ చేశారు రాహుల్. బీజేపీ, బీఆర్ఎస్‌లపై ఫైరయ్యారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రజా తెలంగాణ కోరుకుంటే..దొరల తెలంగాణ వచ్చిందని విమర్శించారు. ఓబీసీ కులగణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే..బలహీనవర్గాల కులగణన చేపడతామని స్పష్టం చేశారు. కులగణన అనేది దేశానికి ఎక్స్‌రే లాంటిదన్నారు రాహుల్‌ గాంధీ.తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ఈ క్యాస్ట్ సెన్సస్‌తోనే పూడుస్తామని జగిత్యాల సభలో ప్రామిస్ చేశారు రాహుల్.