Nizamabad Ragging: నిజామాబాద్ ర్యాగింగ్ రక్కసి.. సీనియర్స్ ఈవ్‌టీజీంగ్ చేస్తున్నారంటున్న బీఫార్మాసీ విద్యార్థులు..
నిజామాబాద్ తిరుమల ఫార్మసీ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది.. సీనియర్స్ ఈవ్‌టీజీంగ్ చేస్తున్నారంటూ బీఫార్మాసీ సెకండియర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

నిజామాబాద్ జిల్లా ర్యాగింగ్ రక్కసి జడలు విచ్చుకుంది. డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారులోని తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైనెన్స్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. సీనియర్స్ చేస్తున్న ర్యాగింపై గతంలో ఫిర్యాదు చేసిన యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు విద్యార్థులు. అయితే కాలేజ్‌లో ర్యాగింగ్ జరగలేదంటుంది కాలేజ్ యాజమాన్యం.. ఇద్దరు విద్యార్ధుల మధ్య గొడవను ర్యాగింగ్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కరెస్పాండెంట్ పద్మావతి, వైస్ ప్రిన్సిపాల్ మహేష్ ఆరోపిస్తున్నారు.
కాగా.. బీ ఫార్మసీ సెకండియర్ చదువుతున్న తమను సీనియర్స్ ర్యాగింగ్ పేరిట వేధిస్తున్నారని కాలేజీలో అమ్మాయిలు ఆందోళనకు దిగారు. కాలేజీకి సంబంధంలేని వాళ్లు కూడా క్యాంపస్‌లోకి వస్తున్నారన్నారు. మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులకు విషయం తెలియడంతో అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు వచ్చి స్టూడెంట్స్ తో పాటు వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి పంపించారు. ర్యాగింగ్ చేస్తున్న నలుగురు స్టూడెంట్స్‌లను అదుపులోకి తీసుకున్నారు. గొడవలకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని కరస్పాండెంట్ పద్మ తెలిపారు.
అయితే.. పోలీసుల తీరుపై విద్యార్థినుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల విద్యాసంస్థలో ర్యాగింగ్ చేసిన స్టూడెంట్స్ ను అదుపు తీసుకుని వదిలేయడం పట్ల విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మసీ కళాశాలలో జరిగింది ర్యాగింగ్ కాదు, గొడవ అంటూ పోలీసులు చెబుతున్నారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ విద్యార్థినిలు సీనియర్లపై చెప్పులు, నీళ్ల బాటిళ్లు విసిరి ఆగ్రహాం వ్యక్తం చేశారని పోలీసులు తెలిపారు. అయితే సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని తెలిపిన పోలీసులు మాత్రం వారిని వదిలిపెట్టడం ఏంటని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం