AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adilabad: వారెవ్వా.. 100వ బర్త్ డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బామ్మ.. ఐదు తరాలతో కలిసి ఇలా..

Adilabad: వందేళ్లు పూర్తి చేసుకొని వావ్ అనిపిస్తోంది. వందేళ్లు పూర్తి‌ చేసుకోవడమే కాదు సకుటుంబ సపరివార సమేతంగా గ్రాండ్ గా పుట్టిన రోజు జరుపుకునే వారెవ్వా అనిపించింది ఈ బామ్మ. మునిమనవల్లతో కలిసి కేక్ కట్ చేసి డీజే పాటలతో ముని మునిమనవల్లతో కలిసి సందడి చేసింది ఈ బామ్మ.

Adilabad: వారెవ్వా.. 100వ బర్త్ డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బామ్మ.. ఐదు తరాలతో కలిసి ఇలా..
Adilabad
Naresh Gollana
| Edited By: |

Updated on: Jan 02, 2024 | 1:33 PM

Share

కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అంటాడు ఒక మహాకవి.. కానీ కొంతమంది వృద్ధులు నేటి తరం దూతలు అని నిరూపిస్తోంది ఈ బామ్మ. వందేళ్లు పూర్తి చేసుకొని వావ్ అనిపిస్తోంది. వందేళ్లు పూర్తి‌ చేసుకోవడమే కాదు సకుటుంబ సపరివార సమేతంగా గ్రాండ్ గా పుట్టిన రోజు జరుపుకునే వారెవ్వా అనిపించింది ఈ బామ్మ. మునిమనవల్లతో కలిసి కేక్ కట్ చేసి డీజే పాటలతో ముని మునిమనవల్లతో కలిసి సందడి చేసింది ఈ బామ్మ.

శతమానం భవతి శతాయుః పురుష షతేంద్రియే ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి అంటూ దీవిస్తుంటారు వేదపండితులు. అచ్చు ఆ దీవెనలు ఫలించి నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి ( టి ) కి చెందిన సెంచరీ బామ్మ రాధబాయి. ఐదు తరాల మనవలు, మనవరాళ్ల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకుని వారెవ్వా అనిపించుకుంది. నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించిన రాధబాయి.. తన నూరవ పుట్టిన రోజు వేడుకలను ఊరందరి మద్య ఘనంగా జరుపుకున్నారు.

హిందు సాంప్రదాయం ప్రకారం ఐదవ తరం ముని మనవళ్లకు వెండి గిన్నెలో పాలు పోసి బంగారు కసికతో పాలు తాగించారు. తన పుట్టిన రోజు వేడుకలకు వచ్చిన చిన్నారులపై రాధబాయి.. ప్రేమ, వాత్సల్యం కనబరిచారు. ఈ వేడుకకు రాధబాయికి కుటుంబానికి చెందిన నాలుగు జిల్లాల నుండి పెద్ద ఎత్తున బంధువులు హాజరయ్యారు. దాదాపు 200 మంది సమక్షంలో రాధబాయి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

రాధబాయితో కేక్ కట్ చేయించి బంధువులు అందరూ సంబరం జరుపుకున్నారు. ఈ వేడుకలు సందర్భంగా రాధబాయి తన అనుభవాలను మనుమళ్ళు, మనవరాళ్ళతో పంచుకున్నారు. అర్లీ ( టి ) గ్రామస్తులు బాలవ్వ జన్మదిన వేడుకల్లో రాధబాయి జీవితాన్ని, ఆమె కష్టపడి కుటుంబాన్ని నిర్వహించిన తీరును కొనియాడారు. రాధబాయి 100 సంవత్సరాల జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఒకెత్తు అయితే, ఇప్పటికీ ఈమె రుచికరమైన వంటలు చేస్తుండటం మరొక‌ ఎత్తు.. తన పని తానే ఎవరి సహాయం అవసరం లేకుండా చేసుకుంటుందంటూ ఆనందం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..