Punjab CM Mann: సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో పంజాబ్ సీఎం పర్యటన.. కొండపోచమ్మ రిజర్వాయర్‌ను పరిశీలించిన భగవంత్ మాన్
పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్‌ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్‌కి వెళ్లిన ఆయన.. కొండపోచమ్మ రిజర్వాయర్‌ను పరిశీలించారు. తరువాత మల్లన్నసాగర్, మర్ముక్ పంప్ హౌస్, పాండవుల చెరువును పరిశీలిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు, భూగర్భజలాల పెరుగుదల, మిషన్ కాకతీయ గురించి పంజాబ్ సీఎం బృందానికి వివరించారు జల వనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్. కాలేశ్వరం నుంచి 618 మీటర్ల ఎత్తులో కొండపోచమ్మ సాగర్ ఉన్నదని, 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. ఇది 2,85,280 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని వివరించారు. అనంతరం కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్‌ను, తొగుటలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టును సీఎం భగవంత్‌సింగ్ మాన్ సందర్శించనున్నారు.
భూగర్భ జలాలను పరిరక్షించేందుకు కొన్నేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులను భగవంత్ మాన్ బృందం పరిశీలిస్తోంది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్‌ల నిర్మాణం ..పనులను అధ్యయనం చేయనున్నారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను పరిశీలిస్తారు.మధ్యాహ్నం పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి గురించి తెలుసుకున్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌తోపాటు గజ్వేల్ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్‌డ్యామ్‌లను పరిశీలిస్తున్నారు. అనంతరం హైదరాబాద్‌కి తిరిగి పయనమవుతారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం