ట్రావెల్స్ మాఫియాను ఆర్టీఏ ఆపలేదా.. ఎందుకీ రూల్స్ బ్రేకింగ్స్?
పాలెం బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనం అయ్యాక కూడా గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నారు ఆర్టీఏ అధికారులు. అలా నిద్రలో ఉన్నారు కాబట్టే కదా ఈ కర్నూలు బస్సు ప్రమాదం. వీళ్లను మించిన కర్కశులు, కర్కోటకులు ఉంటారా ఈ భూమ్మీద. ఈ దేశంలో అత్యంత అవినీతిమయమైన శాఖల్లో ఆర్టీఏ ఒకటి. ఏం.. కాదా? ఈ శాఖను నడుపుతున్న తెలుగు రాష్ట్రాల అత్యున్నతస్థాయి అధికారులు సైతం కాదనగలరా ఈ విషయాన్ని..!

కర్నూలు బస్సు ప్రమాద సమయంలో ఎటుచూసినా ఒళ్లు గగుర్పొడితే దృశ్యాలే. ప్రమాదంలోంచి తప్పించుకురాలేని వాళ్లు అరిచిన అరుపులైతే.. ప్రత్యక్షసాక్షులకు కొన్నాళ్లదాకా చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయ్. ‘కాలిపోతున్నాం.. ఎవరైనా వచ్చి కాపాడండి’ అంటూ ఆడవాళ్లు, పిల్లలు పెట్టిన ఆర్తనాదాలకు ప్రమాదంలోంచి బయటపడిన వాళ్లు గుక్కపెట్టి ఏడ్చారు. అటుగా వెళ్తూ ఆగిన వాళ్లు సైతం ఆ చావుకేకలు విని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ 19 మంది నిలువునా కాలిపోతూ.. ‘దేవుడా కాపాడు’ అంటూ ఒకేసారి రెండు నిమిషాల పాటు కేకలు పెడుతూనే ఉన్నారు. రెండు నిమిషాల తరువాత చూస్తే.. శ్మశాన నిశ్శబ్దం. ఎటుచూసినా అస్తిపంజరాలు, మాంసపు ముద్దలు. ఈ పాపం అంతా ఎవరి ఖాతాలోకి? నిస్సందేహంగా ఆర్టీఏ అధికారులదే. ఇంతమంది కాలిబూడిదయ్యాక కూడా గొంతులోకి ముద్ద దిగుతోందా? తింటుంటే సహిస్తోందా? మరో వారంలో జీతాలు. అప్పుడైనా అనిపించదా.. 19మంది చావులకు కారణమై కూడా సాలరీలు ఎలా తీసుకోగలుగుతున్నాం అని. చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకున్న ఓ తల్లి అడుగుతోంది.. ఆర్టీఏ నిర్లక్ష్యం వల్ల కాదా ఈ ఘోరం అని. సమాధానం చెప్పే ధైర్యం ఉందా ఏ ఒక్క అధికారికైనా? అడ్డూఅదుపు లేని ఆర్టీఏ అవినీతిని, అధికారుల నిర్లక్ష్యాన్ని బాధిత కుటుంబాలు నిలబెట్టి ప్రశ్నిస్తున్నాయి. వాళ్లు చేస్తున్న ఆరోపణలేంటి? ఆర్టీఏలో అవినీతి ఏ స్థాయిలో ఉంది. పాలెం బస్సు ప్రమాదంలో 45 మంది సజీవ దహనం అయ్యాక కూడా గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నారు ఆర్టీఏ అధికారులు. అలా...
