Chaderghat: యువకుడి అదృశ్యం.. పోలీసుల నిర్లక్ష్యం.. కట్ చేస్తే మార్చురీలో మృతదేహం..
ఇంటి నుండి వెళ్లిన కొడుకు 20 రోజులు అవుతున్నా తల్లిదండ్రులకు కనిపించలేదు. రోజులు గడుస్తున్నాయి తిరగని పోలీస్ స్టేషన్ లేదు.. వెతకని చోటు లేదు. కొడుకు ఆచూకీ కోసం కాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగారు ఇకనైనా తమ కొడుకు వస్తాడు ఏమో అని ఎదురు చూశారు.
ఇంటి నుండి వెళ్లిన కొడుకు 20 రోజులు అవుతున్నా తల్లిదండ్రులకు కనిపించలేదు. రోజులు గడుస్తున్నాయి తిరగని పోలీస్ స్టేషన్ లేదు.. వెతకని చోటు లేదు. కొడుకు ఆచూకీ కోసం కాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగారు ఇకనైనా తమ కొడుకు వస్తాడు ఏమో అని ఎదురు చూశారు. కానీ ఫలితం లేదు.. చివరకు గుండెను రాయి చేసుకొని మార్చురీలలో తమ కొడుకు మృతదేహం ఉందో లేదో వెతికారు. తమ కొడుకు మృతదేహం చూసి గుండెలు పగిలేలా రోధించారు తల్లిదండ్రులు. ఇంతకీ ఏం జరిగింది.
చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటన పోలీసుల అలసత్వానికి ప్రత్యేక నిదర్శనం. ఈనెల ఆరవ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని కారు ఢీకొని రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతరం ఆ యువకుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రవణ్ మృతి చెందాడు. ఆరవ తారీకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రవణ్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో తిరగని చోటు లేదు. ఇకనైనా వస్తాడేమో అని వెయ్యి కళ్ళతో చూసిన ఆ తల్లిదండ్రులు.. ఈనెల 11న చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో కూడా ప్రమాదం గురించి పోలీసులు శ్రవణ్ తల్లిదండ్రులతో చెప్పకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదం గురించి మృతుడి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
చివరకు శ్రవణ్ కుటుంబ సభ్యులు చేసేది ఏమీ లేక మార్చురీలో ఉన్నటువంటి మృతదేహాలను చూస్తూ ఉండగా శ్రవణ్ మృతదేహం కనిపించింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా స్పందించిన పోలీసులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని నిర్లక్ష్యంగా బాధితులకు సమాధానం చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయకుండా పోలీసులు దాచిపెట్టడం ఏంటని శ్రవణ్ కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. న్యాయం కోసం మృతదేహంతో చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.
ప్రమాదం జరిగి 20 రోజులు అవుతున్నా.. సీసీటీవీ పుటేజి ద్వారా ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా తమ కొడుకు వస్తాడని ఆశతో ఎదురుచూసిన తల్లిదండ్రులు.. తన కొడుకు ఇక కానరాని లోకాలకు వెళ్లిపోయాడన్న విషయాన్ని తెలుసుకొని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఈ సంఘటన చోటు చేసుకుని 20 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..