Singareni: మొన్న పొత్తులు.. నేడు ప్రత్యర్థులు.. సింగరేణి ఎన్నికల్లో విడివిడిగా తలపడుతున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసిన కాంగ్రెస్- సిపిఐ సింగరేణి ఎన్నికల్లో అమీ తుమీకి సిద్ధమయ్యాయి. డిసెంబర్ 27న జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ ఎవరికి వారే పోటీ చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేసిన కాంగ్రెస్- సిపిఐ సింగరేణి ఎన్నికల్లో అమీ తుమీకి సిద్ధమయ్యాయి. డిసెంబర్ 27న జరిగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ ఎవరికి వారే పోటీ చేస్తున్నారు.
తెలంగాణ హైకోర్ట్ ఆదేశాల మేరకు డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోరాడిన నేపథ్యంలో ఐఎన్‌టీయూసీ , ఏఐటీయూసీ యూనియన్ల మధ్య పొత్తు ఉంటుందని అందరూ భావించారు. పొత్తు కోసం రెండు పార్టీల నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఏఐటీయూసీ , ఐఎన్‌టీయూసీ యూనియన్లు ఎలాంటి పొత్తు లేకుండా ఎవరికి వారే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఐఎన్‌టీయూసీ , ఏఐటీయూసీ మధ్య ప్రధాన పోటీ ఉండటంతో రెండు యూనియన్ల నాయకులు ప్రచారంలో పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీలో దోస్తీ, సింగరేణిలో కుస్తీ పడుతున్న ఐఎన్‌టీయూసీ , ఏఐటీయూసీ పోరు కోల్ బెల్ట్ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ విధానాలు చూసి కార్మికులు ఓట్లు వేస్తారని ఐఎన్‌టీయూసీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏఐటీయూసీ , ఐఎన్‌టీయూసీ యూనియన్ లు ఎలాంటి పొత్తు లేకుండా ఎవరికి వారే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సింగరేణిలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఈ రెండు యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు యూనియన్ల నాయకులు ప్రచారంలో పరస్పర ఆరోపణలు, విమర్శలకు పాల్పడితూ ఎన్నికల్లో పై చేయి సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్, సిపిఐ పార్టీలను కలవరపెడుతున్నప్పటికీ పరిస్థితులు అనివార్యంగా మారడంతో చేసేది ఏమీ లేక ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మీద, అసెంబ్లీలో దోస్తీ సింగరేణిలో కుస్తీ పడుతున్న ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ పోరు కోల్ బెల్ట్ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…