Hyderabad: లిఫ్ట్‌లో చిక్కుకున్న కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత

Hyderabad: లిఫ్ట్‌లో చిక్కుకున్న కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత

Ram Naramaneni

|

Updated on: Dec 24, 2023 | 3:26 PM

సికింద్రాబాద్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్టులో చిక్కుకున్నారు. ఓవర్‌లోడ్‌ కారణంగా లిఫ్ట్‌ కిందకి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే అందులో చిక్కుకుపోయారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్‌ డోర్లు బద్దలుకొట్టి.. సురక్షితంగా బయటకు తీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్‌లో చిక్కుకున్నారు. బోయిన్‌పల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆమె వెళ్లారు. ఆ క్రమంలోనే లిఫ్ట్‌లోకి ఎక్కారు. ఓవర్ లోడ్ కారణంగా ఉన్నట్టుండి లిఫ్ట్‌ కిందకు పడిపోయింది. ఎమ్మెల్యే లిఫ్ట్‌‌లోనే ఉండిపోవడంతో అందరూ కంగారుపడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే లిఫ్ట్ డోర్స్ బ్రేక్ చేశారు. అందర్నీ బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సేఫ్‌గా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

 

 

Published on: Dec 24, 2023 03:25 PM