TSRTC Cargo: ఆర్టీసి కార్గోలో ఫోన్ల పార్శిల్‌లు మాయం.. మొబైల్ ఫోన్ డీలర్స్ ఆందోళన
ఎనిమిది నెలల క్రితమే మొబైల్ ఫోన్ల పార్సిల్ ఒకటి గమ్యానికి చేరలేదు. కొద్ది రోజులు వేచిచూసి ఆర్టీసి కార్గో సర్వీస్ నిర్వాహకులను ఆశ్రయించారు. వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందని డీలర్లు తెలిపారు. దీంతో ఆర్టీసి పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేసి పార్శిల్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను సైతం ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లో అధికారుల హామీతో వెనక్కి తగ్గారు. కానీ ఇప్పటివరకు ఆ పార్శిల్ అడ్రస్ లేదని వాపోతున్నారు
ఆర్టీసీ కార్గో పార్సిల్ లో పంపిన ఫోన్లు మాయం మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. గడచిన కొన్ని నెలలుగా ఫోన్లు పంపేందుకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మొబైల్ ఫోన్ డీలర్స్ అసోషియేషన్ ఆర్టీసి కార్గో సర్వీసును ఉపయోగించుకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ఇక్కడి నుంచే వివిధ గ్రామాలకు, పట్టణాలకు సెల్ ఫోన్ల సేల్స్ నిర్వహిస్తున్నారు. అయితే మిగిలిన కొరియర్ సర్వీస్ లతో పోల్చితే ఆర్టీసి కనెక్టివిటీ బాగుంటుందని భావించారు. ఏ గ్రామం, పట్టణానికైన సులువుగా, వేగంగా ఫోన్లు పంపించవచ్చని గడచిన కొన్ని నెలలుగా ఆర్టీసి కార్గో సర్వీస్ మీద ఆధారపడ్డారు. అవసరం మేరకు వివిధ గ్రామాల్లోని మొబైల్ ఫోన్ల షాప్ లకు ఆర్డర్ మేరకు సరఫరా చేస్తున్నారు.
ఎనిమిది నెలల క్రితమే మొబైల్ ఫోన్ల పార్సల్ మాయం:
అయితే ఎనిమిది నెలల క్రితమే మొబైల్ ఫోన్ల పార్సిల్ ఒకటి గమ్యానికి చేరలేదు. కొద్ది రోజులు వేచిచూసి ఆర్టీసి కార్గో సర్వీస్ నిర్వాహకులను ఆశ్రయించారు. వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందని డీలర్లు తెలిపారు. దీంతో ఆర్టీసి పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేసి పార్శిల్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను సైతం ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లో అధికారుల హామీతో వెనక్కి తగ్గారు. కానీ ఇప్పటివరకు ఆ పార్శిల్ అడ్రస్ లేదని వాపోతున్నారు. అప్పటి నుంచి తరచూ పార్శిల్ లు గమ్యానికి చేరడం లేదని మహబూబ్ నగర్ మొబైల్ ఫోన్ డీలర్స్ అసోషియేషన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధీనంలో ఆర్టీసి కార్గో సర్వీస్ ను ఆశ్రయిస్తే ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఇటివలే మూడు, నాలుగు పార్శిల్ లు గమ్యం చేరలేదని ఎక్కడున్నాయో ఎవరు చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నరు. ఆర్టీసి పై అధికారులను ఆశ్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్న ముందడుగు పడడం లేదని చెబుతున్నారు. దీంతో మళ్లీ పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించారు.
పార్శిల్ పైన వాల్యును తక్కువగా చూపుతున్నారు:
తాము పంపుతున్న ఫోన్ల పార్శిల్ ల పై మొబైల్ పరికరాలు అని పేర్కొంటున్నారని… వాటి వల్ల తాము నష్టపోతున్నామని మొబైల్ ఫోన్ డీలర్స్ అసోషియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఫోన్ల విలువ వేల రూపాయిలు ఉంటే కార్గో సర్వీస్ పార్శిల్ పై వందల రూపాయల విలువ ఉంటుందని పేర్కొంటున్నారు. తాజాగా పంపిన పార్శిల్ లు మిస్ అయ్యాయని చెబితే పార్శిల్ విలువ ఆధారంగా డబ్బులు చెల్లిస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..