PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ..
PM Modi Telangana Tour: ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఖరారయ్యింది. జులై 8న వరంగల్‌కు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కాజీపేటలో వ్యాగన్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు మోదీ శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి నేరుగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

Telangana BJP: తెలంగాణపై కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. జెండా పాతేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. అధికారం దక్కించుకునేందుకు అన్ని అస్త్రాలను ఉపయోగిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఢీ కొట్టి కుర్చీ ఎక్కాలని పూర్తి స్థాయిలో ముందుకు దూకుతోంది. అధికారపార్టీకి తానే ప్రధాన ప్రత్యర్థినని తొడగొడుతోంది. దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తెలంగాణలో అధికారంలోకి వచ్చి లెక్క సరి చేయాలని కమలనాథులు కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా భారతీయ జనతాపార్టీ అగ్రనాయకత్వం ఒకరి తర్వాత ఒకరు తెలంగాణలో సభలు పెడుతున్నారు. గత వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణలో పర్యటించారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల మొదటివారంలో తెలంగాణకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జూలై 8న తెలంగాణకు రానున్నారు. ఇందులో భాగంగా కాజీపేటలో రైల్వే కోచ్ పీరియాడిక్ ఓవర్‌హాలింగ్ సదుపాయానికి శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ యూనిట్ భావిస్తోంది.
తెలంగాణలోని తొమ్మిదేళ్ల పాలనను పురస్కరించుకుని పార్టీ చేపట్టిన ‘మహా జన సంపర్క్ అభియాన్’లో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను ముందుగా నిర్ణయించారు. అయితే పర్యటన వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ అది నెరవేరలేదు. కోచ్ ఫ్యాక్టరీ స్థాపన కోసం భూమిని కూడా గుర్తించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.
గతంలో ఏప్రిల్‌లో తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రూ.11,300 కోట్లుకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రైల్వేలు, రోడ్డు కనెక్టివిటీ, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాలను కలిగి ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
