Eye Sight: స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ అదేపనిగా చూస్తారా..? ఈ ఫార్ములా పాటించకపోతే మీ కంటిచూపు గోవిందా
పొద్దున్న కూర్చుంటే సాయంత్రం వరకు సిస్టమ్ ముందు నుంచి లేచేందుకు కూడా కొందరికి వీలుండదు. ఇంటికి వెళ్లాకైనా కాస్త కళ్లకు రెస్ట్ దొరకుతుంది అనుకంటే ఫోన్ పట్టుకుంటారు.

స్మార్ట్‌ఫోన్..స్మార్ట్‌ఫోన్…ఇప్పుడు ఎవరిచేతిలో చూసినా స్మార్ట్‌ఫోనే..! ఆ ఫోన్ చేతిలో ఉంటే చాలు…ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఎడ్యుకేషన్ వరకు, ఆన్‌లైన్ షాపింగ్ నుంచి ఆఫీస్ పనిదాకా.. ఎక్కడి నుంచైనా పని పూర్తి చేయొచ్చు. దీంతో రోజులో ఎక్కువ సమయంలో స్మార్ట్‌ఫోన్‌తో గడిపే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక మంది స్మార్ట్‌ఫోన్ సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రివేళల్లో అధిక సమయం పాటు స్మార్ట్ ఫోన్‌ను చూసిన ఓ మహిళ కంటిచూపు కోల్పోయిన విధానాన్ని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ వెల్లడించారు. బ్యూటీషియన్‌గా పనిచేసే 30 ఏళ్ల మహిళ తనకు కళ్లు సరిగా కనిపించడంలేదని డాక్టర్‌ను సంప్రదించింది. దివ్యాంగుడైన తన కుమారుడి కోసం ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండటంతో స్మార్ట్‌ఫోన్ చూడటం అలవాటైంది. రాత్రిపూట ఇంట్లో లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఫోన్ చూస్తుండేది. కొద్ది రోజుల్లోనే ఆమె కంటిచూపులో సమస్యలు వచ్చాయి. కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆమె స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు డాక్టర్ సుధీర్.
స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధికి ఎలాంటి మందులు వాడలేదు. కేవలం కౌన్సిలింగ్ నిర్వహించి..అత్యవసరమైతే తప్ప స్మార్ట్‌ఫోన్ ఉపయోగించవద్దని ఆమెకు సూచించారు. దీంతో ఆమె కొంత కాలంపాటు స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించింది. మళ్లీ నెలరోజుల తర్వాత డాక్టర్ వద్దకు వచ్చిన ఆమెకు కంటి సమస్య పూర్తిగా తగ్గిపోయినట్లు పరీక్షల్లో తేలింది.
ఈ మధ్య ఎక్కువమంది ఉద్యోగులు, గృహిణులు స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ , కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం సీవీఎస్ బారిన పడుతున్న వారిలో 66 శాతం మహిళలే ఉంటున్నారు. రాత్రిపూట చీకట్లో మొబైల్ ఫోన్ స్క్రీన్ అత్యవసరమైతే తప్ప చూడవద్దని సూచించారు. ఇక స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ అదేపనిగా చూసేవారు తప్పనిసరిగ్గా 20-20-20 నియమాన్ని పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల విరామం తీసుకుని 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..