వీరు ఎండాకాలంలో సపోటాలు అస్సలే తినకూడదంట! తింటే అంతే ఇక!

samatha 

25 April 2025

Credit: Instagram

సపోటాలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది ఎంతో ఇష్టంగా సపోటా పండ్లు తింటుంటారు.

అందుకే సమ్మర్ లో చాలా మంది ఎంతో ఇష్టంగా సపోటా పండ్లను తింటుంటారు. కానీ కొందరు మాత్రమే అస్సలే సపోటా పండ్లు తినకూడదంట.

సపోటాల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.  అందువలన వీటిని తింటే ఇవి శరీరానికి అవసరమైన పోషకాలన్ని అందుతాయంట.

కానీ కొంత మంది మాత్రం అస్సలే సపోటా పండ్లను తినకూడదంటున్నారు నిపుణులు. కొందరు ఈ పండ్లను తింటే వారికి ఇవి విషంతో సమానం అంట.

ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు సపోటాలను అససలే తినకూడదంట. దీని వలన బీపీ, చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందంట.

కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా అస్సలే సపోటా పండ్లను తినకూడదంట. వీటిని వీరు తినడం వలన సపోటాలు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయంటున్నారు నిపుణులు.

అదే విధంగా శస్త్రచికిత్స చేయించుకునే వారు, ఈ చికిత్స కు ముందు అస్సలే సపోటా పండ్లను తినకూడదంట. ఇవి రక్తస్రావాన్ని పెంచుతాయంటున్నారు పండితులు.

అదే విధంగా ఎక్కువ అలెర్జీ వంటి సమస్యలతో బాధపడే వారు కూడా సపోటా పండ్లను సమ్మర్ లో తినకూడదంట. దీని వలన సమస్య మరింత తీవ్రతరం అవుతుందంట.