నోరూరించే మామిడి తొందరపడి తింటే.. వీరికి గండమే! జర భద్రం
25 April 2025
TV9 Telugu
TV9 Telugu
కేవలం రుచే కాదు.. ఎన్నో సుగుణాలున్న పండు మామిడి. మోతాదుకు మించకుండా తింటే దీనివల్ల బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయట
TV9 Telugu
ఆహారంలో భాగంగా మనం తీసుకునే ఒక్కో విటమిన్ వల్ల ఒక్కో ప్రయోజనం చేకూరుతుంది. వీటిలో విటమిన్ ‘ఎ’ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఈ విటమిన్ మామిడి పండ్లలో పుష్కలంగా లభిస్తుంది
TV9 Telugu
వేసవి కాలం రాగానే మామిడి పండ్లు మార్కెట్‌లో దర్శనమిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
జీర్ణశక్తిని పెంపొందించడానికి మామిడి పండ్లు మేలు చేస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందులో ఉండే ఎంజైమ్‌లు, ఫైబరే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఎంజైమ్‌లు మనం తీసుకున్న ఆహారంలోని ప్రొటీన్లను విచ్ఛిత్తి చేసి ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తాయి
TV9 Telugu
అయితే ఎన్ని లాభాలు ఉన్నప్పటికీ మామిడి కొంతమందికి హాని తలపెడుతుంది. ఏదైనా మితంగా తీసుకుంటే మేలు చేస్తుంది. అదే అధికంగా తీసుకుంటే హాని తప్పదని పోషకాహార నిపుణులు కూడా అంటున్నారు
TV9 Telugu
ముఖ్యంగా డయాబెటిస్ రోగులు మామిడి తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఇందులో ఎక్కువ సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను అధికంగా పెంచుతుంది
TV9 Telugu
మామిడిలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర ఉంటాయి. ఇవి మీ బరువును వేగంగా పెంచుతాయి. కాబట్టి అధిక బరువు ఉంటే వారు ఎక్కువగా తినడం మానుకోవాలి
TV9 Telugu
మామిడికాయకు వేడి స్వభావం ఉంటుంది. దీన్ని ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. దీంతో విరేచనాలు సమస్య తలెత్తుతుంది. కాబట్టి మామిడి అధికంగా తినకపోవడమే మంచిది