మునగ తింటే ఉండదిక ఏ బెంగ..! మీరు తింటున్నారా?

25 April 2025

TV9 Telugu

TV9 Telugu

రుతువులు, కాలాలకు అనుగుణంగా వచ్చే పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా..! అందుకే ఎండాకాలంలో మునక్కాయ, మునగాకు పొడిని తప్పక తినాలంటున్నారు ఆరోగ్యనిపుణులు

TV9 Telugu

మునగకాయలో కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, ఫైబర్, జింక్, రాగి, ప్రోటీన్, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

మునగకాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో పోషకాలు, విటమిన్లు రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.వీటిలో పీచు అధికంగా ఉండటంతో త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలూ తగ్గుతాయి

TV9 Telugu

మునగకాయల్లో ఉండే విటమిన్ ఎ కళ్ళకు మేలు చేస్తుంది. ఈ విటమిన్ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

మునగకాయల్లో విటమిన్ ఇ ఉంటుంది. ఈ విటమిన్ చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే ఇది జుట్టు మూలాలను కూడా బలపరుస్తుంది

TV9 Telugu

మునగకాయల్లో ఉండే విటమిన్ కె ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి చాలా అవసరం. అలాగే ఈ విటమిన్ గాయాలు త్వరగా నయం కావడానికి సహాయపడతాయి

TV9 Telugu

మునగకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. తద్వారా వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది

TV9 Telugu

మునగకాయల్లో విటమిన్ బి-కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు బి1, బి2, బి3, బి5, బి6 ఉంటాయి. ఈ విటమిన్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయ