Prashant Kishore: తెలంగాణలో ఎంటర్ అయిన ప్రశాంత్ కిషోర్.. ప్రకాష్ రాజ్‌తో కలిసి ఫీల్డ్ విజిట్ చేస్తున్న బృందం..
PK in Telangana Politics: తెలంగాణలో పీకే టీం ఎంటర్ అయింది. రాష్ట్ర రాజకీయాల గురించి ఇప్పటికే.. అధ్యయనం చేసిన పీకే బృందం.. అసలు ప్రణాళికపై దృష్టిసారించింది. తాజా పరిణామాలు చూస్తుంటే..
PK in Telangana Politics: తెలంగాణలో పీకే టీం ఎంటర్ అయింది. రాష్ట్ర రాజకీయాల గురించి ఇప్పటికే.. అధ్యయనం చేసిన పీకే బృందం.. అసలు ప్రణాళికపై దృష్టిసారించింది. తాజా పరిణామాలు చూస్తుంటే.. పీకే టీఆర్ఎస్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించే పనిలో ఉన్న గులాబీ బాస్ సీఎం కేసీఆర్.. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) తో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో తెలంగాణ, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహం.. ఎన్నికలలో అనుసరించాల్సిన విధానంపై పీకే నేరుగా పర్యవేక్షించనున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో నిన్నటి నుంచి తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ పర్యటన మొదలైంది. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ నిన్న ప్రకాష్ రాజ్‌తో కలిసి మల్లన్న సాగర్‌లో పర్యటించారు. తెలంగాణలో టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా పీకే అండ్ టీం పరిశీలిస్తున్నారు. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత పీకే తన వ్యూహాలకు పదును పెట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఒక దశ ప్రాథమిక సర్వే కూడా ఐప్యాక్ బృందం సభ్యులు పూర్తి చేసినట్లు పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై కూడా పీకే పార్టీ అధినేత సీఎం కేసీఆర్ (CM KCR) కు సూచనలు చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే.. తెలంగాణ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు. అధికార గులాబీ పార్టీకి పీకే నేరుగా పని మొదలు పెడితే.. ఆయన దగ్గర పనిచేసిన కొందరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గులాబీ బాస్ కేసీఆర్ సూచన మేరకు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు కలసి పీకే కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్‌ను సందర్శించారు. దానితోపాటు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పీకే నేరుగా ఫీల్డ్‌కు వెళ్లి తెలుసుకున్నట్టు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికలు మార్చి 10న ముగిసిన వెంటనే గోవాలో ఉన్న పీకే ఫుల్ టీం తెలంగాణలో దిగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది. పీకే టీం నుంచి రిషి తెలంగాణ బాధ్యతలు వహించబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పీకేతో సహా టీంలోని ముఖ్యులతో భేటీ అయినట్టు తెలుస్తోంది.
అయితే.. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల రాజకీయాల్లో వ్యూహాలు రచించి.. పలువురు ముఖ్యమంత్రులు కావడంలో చక్రం తిప్పారు. 2015లో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, 2017లో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమహేందర్ సింగ్ , 2019లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 2021లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు ప్రశాంత్ కిషోర్ బృందం పూర్తి స్థాయిలో పని చేసి వారికి అధికారం చేపట్టేలా వ్యూహాలు రచించి విజయం సాధించింది.
Also Read: