సైలెంట్‌గా ఉండే ఫామ్‌హౌస్‌లో అదిరిపోయే సౌండ్స్.. ఏంటని చూస్తే పోలీసులే షాక్!
హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే ఫామ్‌హౌజ్‌లలో వరుస పార్టీలు.. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా తగ్గేదే లేదంటున్నారు పార్టీ ప్రియులు. లేటేస్ట్‌గా హైదరాబాద్ శివార్లలో మరో లిక్కర్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. 25 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే ఫామ్‌హౌజ్‌లలో వరుస పార్టీలు.. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా తగ్గేదే లేదంటున్నారు పార్టీ ప్రియులు. లేటేస్ట్‌గా హైదరాబాద్ శివార్లలో మరో లిక్కర్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు.
రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. లింగంపల్లిలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న లిక్కర్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో ఫామ్‌హౌస్‌లో రైడ్స్ చేసిన పోలీసులు.. 25 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్ట్ చేశారు. వారి నుండి 2 లక్షల 40 వేల రూపాయలతో పాటు 11 వాహనాలు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందిరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే నిందితుల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఉండడం జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ సంచలనం రేపుతోంది. పట్టుబడ్డ 8 మంది మహిళలను మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించగా నిందితుల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఉన్నారు.
హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇటీవలే మహేశ్వరంలో మిడ్‌నైట్ డర్టీ పార్టీకి చెక్ పెట్టారు పోలీసులు. పక్కా సమాచారంతో శివారులోని ఓ రిసార్ట్‌పై రెయిడ్ చేశారు. మందు, విందుతో పాటు అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఓ సీడ్ కంపెనీకి చెందిన 50 మందితో పాటు 26 మంది యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల వేళ జరుగుతున్న ఈ వరుస పార్టీలు చర్చనీయాశంగా మారాయి.
రేవ్ పార్టీలతో పాటు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న లిక్కర్ పార్టీలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కూడా అస్సలు తగ్గడం లేదు నిషాచరులు. మరోవైపు ఇలాంటి పార్టీలకు రిసార్స్ట్‌ను రెంట్‌కు ఇచ్చి రిస్క్‌లో పడవద్దని నిర్వాహకులకు సూచిస్తున్నారు పోలీసులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
