AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం.!

మాయం అయిపోతున్నాడు అమ్మ.. మనిషి అన్నవాడు.. అనే పాట అక్షర సత్యం అనిపిస్తోంది. ఆస్థి కోసం ఇంటి పెద్దనే చంపేశారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ స్టోరీని తెలుసుకుందామా..

18 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం.. కట్ చేస్తే.. వెలుగులోకి షాకింగ్ నిజం.!
Hyderabad Police
P Shivteja
| Edited By: |

Updated on: Jan 23, 2024 | 8:37 PM

Share

మాయం అయిపోతున్నాడు అమ్మ.. మనిషి అన్నవాడు.. అనే పాట అక్షర సత్యం అనిపిస్తోంది. ఆస్థి కోసం ఇంటి పెద్దనే చంపేశారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ స్టోరీని తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో 18 నెలలు క్రితం మృతి చెందిన వ్యక్తి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీస్ కార్యాలయానికి ఫిర్యాదు చేయగా.. తిరిగి రీ-పోస్టుమార్టం నిర్వహించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. చేగుంట మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన కావేటి కిష్టయ్య.. 2022వ సంవత్సరం జూలై 16న మృతి చెందాడు. అనంతరం కిష్టయ్య మృతదేహాన్ని గ్రామంలో పూడ్చిపెట్టారు. వారం రోజుల క్రితం కిష్టయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కొంతమంది గ్రామస్థులు జిల్లా పోలీస్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ బలస్వామి ఆదేశాల మేరకు సోమవారం కిష్టయ్య మృతదేహాన్ని రీ-పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతుడు కిష్టయ్యకు గ్రామంలో మూడే ఎకరాల భూమి ఉంది. ఈ భూమి విషయంలో కుటుంబసభ్యుల మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. దీంతో అతడ్ని చంపేయాలని నిర్ధారించుకున్నారు. ఇదే క్రమంలో అతడి భోజనంలో నిద్రమాత్రలు ఇచ్చి, నిద్రపోయిన అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత ఏమీ తెలియనట్టుగా సహజ మరణంగా అందర్నీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, విషయమంతా బయటపడింది.

దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రి వైద్యులను రప్పించిన పోలీసులు గ్రామంలోని శవాన్ని పూడ్చిపెట్టిన స్థలం వద్ద తవ్వకాలు చేపట్టి, శవపరీక్ష నిర్వహించారు. ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఈ కేసులో మృతుడి భార్య, కుమారుడు, కుమార్తె, అల్లుడి ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. రామాయంపేట సీఐ లక్ష్మీ బాబు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్